NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

Corona second wave: ప్రభుత్వ కష్టాలే సెలబ్రిటీల కష్టాలు… ప్రజల కష్టాలు కాదు…!

Indian celebrities silent on COVID crisis

Corona second wave: కరోనా సెకండ్ వేవ్ భారతదేశాన్ని కాటేసింది. రోజుకి లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. వేలల్లో ప్రజలు చనిపోతున్నారు. వీటన్నింటికంటే దయనీయంగా ఆస్పత్రిలో బెడ్ లు అందుబాటులో లేక ఆక్సిజన్ సదుపాయం లేక చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అయితే దీనిపై మన భారత సెలబ్రిటీలు ఒక్కరూ ఎందుకు నోరు మెదపడం లేదు?

 

Indian celebrities silent on COVID crisis
Indian celebrities

అప్పుడేమో #Indiagettogether

గతంలో రిహానా అనే హాలీవుడ్ పాప్ సింగర్ రైతులు కేంద్రానికి, కార్పొరేట్ లకు వ్యతిరేకంగా చేస్తున్న సమ్మె పైన స్పందించి ట్వీట్లు వేసింది. అంతే…. kanganaranaut మొదలుకొని విరాట్ కోహ్లీ వరకూ బాలీవుడ్ సెలబ్రిటీలు, భారత క్రికెటర్లు అంతా మనదేశ సమస్యను ఇతర దేశస్తులు ఎత్తి చూపాల్సిన అవసరం లేదు…, మనమంతా ఒకటే అని నిరూపిద్దాంసామరస్యంగా మన సమస్యలను మనమే పరిష్కరించుకుందాం అని ట్వీట్లు వేశారు. India get together, India against propaganda అనే హ్యాష్ ట్యాగ్ లతో తో వారు ఇండైరెక్టుగా ప్రభుత్వానికి, కార్పొరేట్లకు వత్తాసు పలికారు.

Corona second wave: ఇప్పుడేమో సైలెంట్

కట్ చేస్తే…. రెండవ కరోనా వేవ్ లో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. ముందుచూపు లేక, సమయానుకూలంగా కఠిన నిర్ణయాలు తీసుకోలేక సేఫ్ గేమ్ ఆడుతున్న భారత దేశ ప్రభుత్వాన్ని మన దేశస్తులే తప్పు పడుతున్నారు. గట్టిగా మాట్లాడితే పనిగట్టుకొని తప్పుపట్టాల్సిన అవసరం లేదుప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన కళ్ళముందే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఒక్క భారత సెలబ్రెటీ కూడా ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదు. ప్రజలందరితో కలిసి న్యాయం కోసం పోరాడడంలేదు. న్యాయం సంగతి పక్కనపెడితే తమ వంతుగా ఆక్సిజన్ సదుపాయాలు అందించడం, తమ పాపులారిటీతో జనాలకి ఉపయోగపడిన దాఖలాలు కూడా దాదాపు సున్నానే.

దారుణాల మధ్యే ఉంటూ….

ఫిలిం స్టార్లు తమ తోటి నటీనటులు కరోనా బారినపడి ఆస్పత్రి పాలవుతున్నాఎంతో మంది సీనియర్ నటులు చనిపోతున్నాపెదవి విప్పడం లేదు. ఇక క్రికెటర్లలో చాలామంది కోవిడ్ బారినపడి టోర్నమెంట్ మొదట్లో మ్యాచ్ లకు దూరం అయ్యారు. విదేశీయులు అయితే భయపడి టోర్నమెంట్ నుండి పారిపోతున్నారు. అయినప్పటికీ ఒక్క క్రికెటర్ కూడా నోరు మెదపలేదు. 

Corona second wave: ప్రజల మాటేంటి?

ఇప్పుడు ఈ విషయంపై విపరీతమైన చర్చ సామాజిక మాధ్యమాల్లో జరుగుతోంది. ఒక విదేశీ పాప్ సింగర్ ఒక్క ట్వీట్ వేసినందుకే రెచ్చిపోయిన మన భారత సెలబ్రిటీలు రాజకీయ వ్యవస్థ విఫలమై తమ స్వార్థం కోసం కరోనా వ్యాపిస్తున్న సమయంలో ఎలక్షన్ ర్యాలీలు నిర్వహించి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినప్పటికీ ఒక్కరు కూడా దీనిపై ప్రశ్నించపోవడంతో మన దేశంలో ఉన్న దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. వీరి దగ్గరనుంచి బాధ్యత ఆశించడం మన అవివేకమే అనుకోవాలేమో

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N