NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

నీళ్లు చెప్పిన కఠిన నిజాలు..! హైదరాబాద్ వరదలు ఎందుకో తెలుసా..!?

* కేటీఆర్ ఇది చేస్తే నువ్వు హీరో అయితవ్..!

“హైదరాబాద్ గల్లీల్ల నీళ్లు పారినయ్.., గుడిసెలు మునిగినయ్.., రెండు దినాల సంది గా నీళ్లు పాణం మీదకు వచ్చి సంపుతున్నాయ్..!! గిది జరగనీకి రెండు దినాల ముంగటే గా మంత్రి కేటీఆర్ అసెంబ్లీల ఓ మాట సెప్పిండు..“హైదరాబాద్ లో గడిచిన ఆరేళ్లలో రూ. 67 వేల కోట్లతో అభివృద్ధి చేసాం. రూపు రేఖలు పూర్తిగా మార్చేసాం” అనిండు..!! గీ మాటకి పూర్తి విరుద్ధంగా నీళ్ళొచ్చి నిజం సెప్పినయ్.., అందుకే ఇప్పుడు మల్ల గా కేటీఆర్ నెట్ల పోరగాళ్లకు టార్గెట్ అయ్యిండు”

ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం. హైదరాబాద్ లో నీటి వరద కొత్త కాదు. వరద వచ్చిన ప్రతీసారి నాయకులు టార్గెట్ అవ్వడం కొత్త కాదు. మళ్లీ వాళ్ళకే ఓటేసి గెలిపించడం కొత్త కాదు..! కానీ వరదలకు రెండు రోజుల ముందే కేటీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన, తర్వాత వరదలు వచ్చి చాలా ప్రాంతాలు మునగడం..! కేటీఆర్ చెప్పిన అభివృద్ధి ప్రసంగంపై ఇప్పుడు సెటైర్లు పడుతున్నాయి..! అందుకే తెలంగాణ ప్రభుత్వం అంటేనే మాటల సమాజం. కేసీట్ మాటలతో మాయలు చేసి, జనాన్ని గుప్పిట్లో పెట్టుకున్నట్టే.., ఈ కేటీఆర్ కూడా తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ ఒక్కటి నిజం. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మెసేజ్ హైదరాబాద్ లో కొత్త నిజాన్ని ఆవిష్కరిస్తుంది.

180కి పైగా గొలుసుకట్టు చెరువుల హైదరాబాద్..!!

ఒక్క హైదరాబాద్ లో ఇన్ని చెరువులా అని ఆశ్చర్యపోతారేమో గానీ అదే నిజం. హుస్సేన్, ఉస్మాన్, హిమయత్ సాగర్లతో పాటూ..!! మంత్రాల చెరువు, కొత్త చెరువు, ఐడీపీఎల్ చెరువు, హస్మత్‌పుర చెరువు, బాలాజీనగర్ చెరువు, కౌకూర్ చెరువు, సూరారం చెరువు, లింగంచెరువు, వెన్నెలగడ్డ చెరువు, ప్రగతినగర్ చెరువు, కాప్రా చెరువు, కీసర చెరువు, పూడురు చెరువు, ఎల్లమ్మపేట చెరువు, మేకంపూర్ చెరువు, నల్లచెరువు, పల్లె చెరువు, దుర్గం చెరువు, రామంతపూర్ చెరువు, సఫీల్ గూడ చెరువు, అల్వాల్ చెరువు, సరూర్ నగర్ చెరువు, అమీనాపూర్ చెరువు, జీడిమెట్ల చెరువు…!

బంజారా చెరువు (బంజారాహిల్స్), షామీర్ పేట్ చెరువు, నారాయణరెడ్డి కత్వా, బాచారం కత్వా, హీరా కత్వా, రాయిన్‌చెరువు, మాలోనికుంట, అంట్ల మాసమ్మకుంట, మైసమ్మ చెరువు, పెద్ద చెక్‌ డ్యాం, మెట్టు కత్వా, బుంగ కత్వా, బూబాగడ్డ చెక్‌ డ్యాం, ఎర్రబండ చెక్‌డ్యాం, బంధంకుంట, బైరాంఖాన్‌ చెరువు, ఈదులచెరువు, దిల్‌వార్‌ఖాన్‌ చెరువు, పోల్కమ్మ చెరువు, అంతాయపల్లి చెరువు, కుంట్లూర్‌ చెరువు, కంబాలకుంట, మాసబ్‌ చెరువు, వడ్లకుంట, కొత్త చెరువు, బందకుంట అమీర్‌పేట, యూసుఫ్‌గూడ చెరువు, శ్యామలకుంట సనత్‌నగర్‌, మైసమ్మకుంట, చాపల చెరువు… ఇవే గాక తుమ్మల కుంట, చింతలకుంట, పుప్పలకుంట, కూర్మ చెరువు, కుత్బుల్లాపూర్‌ చెరువు, కోమ కుంట, కోమార్‌కుంట, గొల్లవాని కుంట, భజన్‌సాహికుంట, బొంగలకుంట, షాన్‌ కీసమున కుంట, హెచ్‌ఎంటి కాలనీ చెరువు, క్వారీ కుంట, క్యామ్‌లాల్‌ లే అవుట్‌ చెరువు, సుదర్శన్‌ చెరువు, అంజయ్య చెరువులు పూర్తిగా కనిపించకుండా పోయాయి…!!

ఇవన్నీ ఏమయ్యాయో తెలుసా..!!

ఒక్క ఉదాహరణ ; పాత బోయిన్ పల్లిలో ఉండే కొత్త చెరువు 1990 నాటికి 29 ఎకరాలు. 2006 నాటికి 14 ఎకరాలు మిగిలింది. ఇప్పుడు 3 ఎకరాలు మాత్రమే ఉంది. ఇదీ వాస్తవ పరిస్థితి. చెరువులు చెరువుల్లాగా ఉంటేనే కదా… నీళ్లు చెరువుల్లో చేరి రోడ్లుపైకి రాకుండా ఉంటాయి. కానీ చెరువులు లేకపోతే నీళ్లు ఎక్కడకు వెళ్ళాలి..? ఎక్కడ ఉండాలి..? అందుకే ఇళ్లల్లోకి, వీధుల్లోకి వస్తున్నాయి. చెరువులను ఆక్రమించిన కట్టిన కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చిన వారిదే నేరమంతా. అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేసిన పాలకులదే పాపమంతా. మరి మాటల కుటుంబం కేసీఆర్ వారుసుడు కేటీఆర్ సంస్కరణ తీసుకొస్తాడా.., మాటలతో గడిపేస్తాడా..?? ఆయనకే వదిలేద్దాం..!!

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N