విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే ఇది తెలుసుకోండి!

Share

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో సాధార‌ణ జ‌న‌జీవనం పూర్తిగా మారింది. వైర‌స్ నుంచి త‌మ‌ను ర‌క్షించుకోవాలంటే, దాని బారిన‌ప‌డి ప్రాణాలు పోకుండా నిలుపుకోవాలంటే ఆరోగ్యం ప‌ట్ల మరింత జాగ్ర‌త్త వ‌‌హించాల‌ని నిపుణులు సూచించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో టాబ్లెట్ల వాడ‌కాన్ని ప్ర‌జ‌లు భారీగీ పెంచారు. మ‌రీ ముఖ్యంగా క‌రోనాను ఎదుర్కొనేందుకు… రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డానికి విట‌మిన్ టాబ్లెట్ల‌ను వాడుతున్నారు. అయితే, వైద్యుల స‌ల‌హాలు, సూచ‌న‌లు లేకుండా విట‌మిన్ టాబ్లెట్ల‌ను అతిగా వాడితే అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుత్తాయ‌ని ఇదివ‌ర‌కే వైద్య నిపుణులు హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా విటమిన్ టాబ్లెట్లు అధికంగా వాడితే అన‌ర్ధాల‌కు దారీ తీస్తుంద‌నీ, తీవ్ర‌మైన అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారీ తీస్తుంద‌ని నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీ ఇన్ఫ‌ర్మేష‌న్ (ఎన్‌సీబీఐ) సైతం తాజాగా హెచ్చ‌రించింది. ఇష్టానుసారంగా విట‌మిన్ ట్యాబ్లెట్లు వాడితే ఏరికోరి కొత్త‌గా అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను కొనితెచ్చుకోవ‌డ‌మేన‌నీ పేర్కొంటున్న‌ది. విట‌మిన్ ట్యాబ్లెట్ల‌ను అతిగా వాడితే వాటి స్థాయి పెరిగి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయిని తెలిపింది. గొంతు నొప్పి, అల‌స‌ట‌, కంటి చూపు మంద‌గించ‌డం, కిడ్నీలు చెడిపోవ‌డం వంటి అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని పేర్కొంది.

కాగా, శ‌రీరానికి విట‌మిన్లు ఔష‌ధ రూపంలో కాకుండా.. ఆహారం ద్వారా తీసుకుంటేనే మేల‌ని నిపుణులు వెల్ల‌డిస్తున్నారు. విట‌మిన్-డీ స‌హ‌జంగానే సూర్య‌ర‌శ్మీ నుంచి ల‌భిస్తుంద‌నీ, ఇది తెలియ‌క మందులు తీసుకోవ‌డం మంచిది కాద‌నీ తెలుపుతున్నారు. నిత్యం కూర‌గాయాలు, పప్పు దినుసులు తీసుకుంటే శ‌రీరానికి కావ‌ల‌సిన విట‌మిన్లు క్ర‌మంగా పెరుగుతాయ‌ని సూచిస్తున్నారు. విట‌మిన్ ట్యాబ్లెట్లు తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి అయితే, వైద్యుల స‌ల‌హామేర‌కూ తీసుకోవాల‌ని వివ‌రిస్తున్నారు.


Share

Related posts

బిగ్ బాస్ 4 : ” మళ్ళీ పెళ్లి చేసుకుంటా .. అతన్ని వదిలేయడం లో తప్పు లేదు ” దేవి నాగవల్లి !

sekhar

క్యాడర్ ని రెడీ చేస్తున్న చంద్రబాబు..??

sekhar

టీడీపీ కాంగ్రెస్ పోత్తు పై చర్చ

sarath