NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

Vizag Steel Plant : వైజాగ్ “ఉక్కు దెబ్బ” జగన్ కా..? మోడీ కా..!? (పార్ట్ – 2)

Vizag Steel Plant : Mistakes by Jagan or Modi..?

Vizag Steel Plant : విశాఖ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు సమయం, సందర్భం, పోరాటం, ఉద్యమం.. పరిశ్రమ పూర్తి అంశాలు.. లాభ నష్టాలు నిన్నటి కథనంలో చర్చించాం..! ఇప్పుడు (Visakha ukku – Andhrula Hakku) విశాఖ ఉక్కు పరిశ్రమ నష్టాలు పేరిట ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. కేంద్ర క్యాబినెట్ లో తీర్మానం కూడా ఆమోదించింది. రూ. లక్షన్నర కోట్ల విలువైన పరిశ్రమని రూ. 30 వేల కోట్లకు కట్టబెట్టేయాలని ప్లాన్ వేసిందని ఆరోపణలు వస్తున్నాయి. ఏది ఏమైనా.., ఎంతకు అమ్మినా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కావడం మాత్రం ఖాయమే..!? మరి ఆ విశాఖ ఉక్కు దృఢ సంకల్పం ఏం కావాలి..? 32 మంది ప్రాణాలు పోగొట్టుకుని.., రెండేళ్లు ఉద్యమం చేసి సాధించుకున్న ఉక్కు ప్రైవేట్ చేతుల్లోకి వెళ్తే జరిగేదేమిటి..? వాళ్ళు ఇష్టారీతిన నడిపితే విశాఖ ఉక్కు నగరమన్న పేరు ఏం కావాలి..!?

ఇదీ చదవండి : Vizag Steel Plant : వైజాగ్ “ఉక్కు దెబ్బ” జగన్ కా..? మోడీ కా..!? (పార్ట్ – 1 )

Vizag Steel Plant : Mistakes by Jagan or Modi..?
Vizag Steel Plant Mistakes by Jagan or Modi

Vizag Steel Plant : రాజధాని కంటే ఉక్కుకు మద్దతు..!? జగన్ కి దెబ్బె..!?

విశాఖ పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ప్రకటించారు. అన్నీ అనుకూలిస్తే మరో రెండు నెలల్లో పాలనని షిఫ్ట్ చేయడానికి ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. రాజధాని విషయంలో విశాఖ నుండి జగన్ కి ఆశించిన మైలేజి వచ్చిందో..? లేదో..? అప్పుడే తెలియదు. రాజధాని ఇచ్చినా.., ఇవ్వకపోయినా… అక్కడ వనరులకు తగ్గట్టు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి..? ఉపాధి అవకాశాలు పెంచాలి.. అని మాత్రం డిమాండ్లు ఉన్నాయి. మరి.. ఆ సందర్భంలో విశాఖ రాజధానిగా పరిపాలన షిఫ్ట్ చేస్తే సీఎం జగన్ కి వచ్చే మైలేజి కంటే.., విశాఖ ముక్కుని ప్రైవేట్ పరం కాకుండా పోరాడకపోతే జగన్ కి వచ్చే నష్టం ఎక్కువగా ఉంటుంది. విశాఖ ఉక్కు పరిశ్రమకి కేంద్రం విశాఖ వాసులే పోరాడలేదు. 1967 నుండి 1970 మధ్య ఆంధ్ర మొత్తం అందుకు కదిలింది. “విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు” పేరిట 15 జిల్లాల్లో పోరాటం రగిలింది. ఇప్పుడు దాన్ని ప్రైవేట్ పరం చేసేస్తే సెంటిమెంట్ గా చాలా ఉద్యమం రేగే అవకాశం ఉంది. ఈ ఉద్యమంలో జగన్ లాంటి నాయకుడు, పాలకుడు మద్దతు తెలపకుండా పిల్లి మొగ్గలు వేస్తే మాత్రం దెబ్బ తినక తప్పదు. అసెంబ్లీలో తీర్మానం చేసి.., రాష్ట్ర ప్రభుత్వం తరపున నోట్ తయారు చేసి… విశాఖ ఉక్కు ప్రభుత్వమే నడిపించేలా బాధ్యత తీసుకోవాల్సింది మాత్రం జగనే..!!

Vizag Steel Plant : Mistakes by Jagan or Modi..?
Vizag Steel Plant Mistakes by Jagan or Modi

Vizag Steel Plant : ఏపీ బీజేపీ అదే డ్రామాలు..!!

పోలవరానికి కేంద్రం నిధులివ్వము అంటుంది. కానీ ఏపీ బీజేపీ నేతలు పోలవరం నిర్మాణం బీజేపీతోనే సాధ్యం అంటారు..! ఏపీకి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వము అంటుంది.. కానీ ఏపీకి న్యాయం చేయడం బీజేపీ వలనే సాధ్యం అంటూ ఏపీ బీజేపీ నేతలు చెప్తుంటారు..! కేంద్రం ఏపీకి కనీసం నిధులివ్వడం లేదు.., కానీ ఏపీ బీజేపీ నేతలు బడ్జెట్ లో రాష్ట్రానికి న్యాయం జరిగింది అంటారు..! ఇవన్నీ చూసుకుంటే ఏపీ బీజేపీ డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. కేంద్రం ఏపీకి దెబ్బ మీద దెబ్బ వేస్తుంటే… ఏం చేయాలో తెలియక.., కేంద్రంతో గట్టిగా మాట్లాడలేక… ఏపీ అవసరాలు తెలియక.., రాష్ట్రం బాగు కోసం కనీసం పని చేయలేక… ఇక్కడ పార్టీ వాదనని మాత్రం వినిపిస్తూ నెట్టుకొస్తున్నారు. సో.., విశాఖ ఉక్కు విషయంలో బీజేపీ ఆటలు సాగేది లేదు. అక్కడ పోరాటం ఉధృతం అయితే మాత్రం బీజేపీ సమాధానం చెప్పుకోలేదు. ఏపీలో ఆటలో అరటిపండులా ఉన్న బీజేపీకి దీని వలన పెద్దగా నష్టం ఉండకపోవచ్చు.., కానీ జగన్ మాత్రం ఈ విషయంలో ముందడుగు వేయకపోతే కొంత మేర నష్టం తప్పకపోవచ్చు.

Vizag Steel Plant : Mistakes by Jagan or Modi..?
Vizag Steel Plant Mistakes by Jagan or Modi

సందు చూసుకుంటున్న టీడీపీ..!!

ప్రతిపక్ష టీడీపీకి పోరాడడానికి పెద్దగా ఆయుధాలు దొరకడం లేదు. రాజధాని వికేంద్రీకరణ.. అమరావతి రాజధాని మార్పు పోరాటం పాత బడింది. ఇప్పుడు ఆ అంశం కోర్టులోకి వెళ్ళింది. ఇక కొత్త ఉద్యమం అందుకోవాలి అంటే విశాఖ ఉక్కు ఉద్యమమే వారికి బాట. ఇప్పటికే టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు.., ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.., మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తదితరులు విశాఖ ఉక్కు పోరాట పాత అందుకున్నారు. టీడీపీ అధినేత మాత్రం ప్రస్తుతానికి ఏమి మాట్లాడలేదు. గట్టిగా మాట్లాడితే మోడీకి కోపం వస్తుందేమో.., అనే భయంతో టీడీపీ పెద్దలు పిల్లిమొగ్గలు వేసే వీలుంది. అందుకే ఉత్తరాంధ్ర నేతలు మాత్రమే ప్రస్తుతానికి పోరాట బాట అందుకుంటున్నారు. వైసీపీ నుండి అయితే ప్రస్తుతానికి ఈ కదలిక కూడా లేదు..!!

 

 

 

 

author avatar
Srinivas Manem

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju