NewsOrbit
సినిమా

చైనాలో `జెర్సీ` 


నేచుర‌ల్ స్టార్ నాని హీరోగా పి.డి.వి.ప్ర‌సాద్ స‌మ‌ర్ప‌ణ‌లో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం `జెర్సీ`. శ్ర‌ద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌. ఏప్రిల్ 19న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా నాని `జెర్సీ` సినిమా చైనాలో విడుద‌ల‌వుతుంద‌ని నాని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ..
నాని మాట్లాడుతూ “`జెర్సీ`ఫైన‌ల్ ఔట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. జెర్సీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ ఏప్రిల్ 12న‌, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏప్రిల్ 15న ఉంటుంది. జెర్సీ`..మోస్ట్ బ్యూటీఫుల్‌, హార్ట్ ట‌చింగ్‌, మ్యాజిక‌ల్ ఫిల్మ్ ఇన్‌ మై కెరీర్ `. ఈ నెల 19న జెర్సీ విడుద‌ల కానుంది. పాత్ర ప‌రంగా 36 ఏళ్ల వ‌య‌సులో ఉన్న వ్య‌క్తిగా న‌టిస్తుండ‌టం వ‌ల్ల కాస్త లావ‌వుదామ‌ని అనుకున్నా. కానీ నాకే తెలియ‌కుండా త‌గ్గాను. న‌న్ను నేను మ‌ర్చిపోయి ఇటీవ‌ల‌ ఈ సినిమా చూశా. 20 సార్లు సినిమా చూశా. ఇందులో నాతో పాటు ప్ర‌తి ఒక్క‌రూ నానిని మ‌ర్చిపోయి, కేవ‌లం అర్జున్‌ని మాత్ర‌మే చూస్తారు. ఆర్టిస్టుగా నాకు ఎక్స్ ట్రీమ్ శాటిస్‌ఫేక్ష‌న్ వ‌చ్చింది. అంద‌రూ ఈ సినిమాకు క్రికెట్ ప్ర‌ధాన‌మ‌ని అనుకుంటున్నారు. కానీ అంత‌కు మించిన స‌ర్‌ప్రైజ్ ఉంది. ఇది మోస్ట్ ఎమోష‌న‌ల్ సినిమా. నేను ఇంత‌కు ముందు ఏ సినిమా చేసినా స‌రే… `ఇదే ఆఖ‌రి రోజు` అనే ఫీలింగ్ ఉండేది త‌ప్పితే, `అరే.. ఈ రోజు ఇది ఆఖ‌రి రోజా…` అని పెద్ద‌గా ఎప్పుడూ ఫీల్ కాలేదు. కానీ ఈ సినిమాకు మాత్రం ఎవ‌రో నాతో పాటు క‌లిసి పెరిగిన క్లోజ్ ఫ్రెండ్ అర్జున్‌కి సెండాఫ్ ఇస్తున్న ఫీలింగ్ వ‌చ్చింది. నా కెరీర్‌లో నేను చేసిన సినిమాల్లో ఆఖ‌రి రోజు ఇంత బ‌రువుగా ఇంటికి వెళ్లింది `జెర్సీ` సినిమాకే. ఏ స్పోర్ట్స్ లో అయినా, స్పోర్ట్స్ మేన్ వేసుకునే టీ ష‌ర్ట్ ని జెర్సీ అని అంటారు. కేవ‌లం క్రికెట్ మీద సినిమా కాబ‌ట్టి జెర్సీ అనే టైటిల్‌ పెట్టాం అని అనుకోవ‌ద్దు. జెర్సీ అనే కాన్సెప్ట్ మీద చాలా ఎమోష‌న్ ఉంటుంది. అదేంట‌న్న‌ది 19న తెలుస్తుంది. నేను, మా నిర్మాత‌ వంశీ ఇద్ద‌రం క్లాస్‌మేట్స్. క్రికెట్ మెయిన్ టీమ్‌లో త‌ను ఉండేవాడు, నేను ఎక్స్ ట్రా ప్లేయ‌ర్స్ లో ఉండేవాడిని. వంశీ కెరీర్లోనూ ఇది మంచి సినిమా అవుతుంది. `వీడు మా డైర‌క్ట‌ర్ ` అని చెప్పుకోద‌గ్గ స్థాయిలో ఒక ద‌ర్శ‌కుడు దొరికాడు. నేను ఇంత‌కు ముందు ఎప్పుడూ ఇలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వ‌లేదు. గౌత‌మ్ గురించి చెప్పాల‌నిపించింది. గౌత‌మ్ తొలిసారి వ‌చ్చి క‌థ చెప్పిన‌ప్పుడు, ఇందులో క్రికెట్ అనేది నీడ మాత్ర‌మే, కానీ ఎమోష‌న్ గొప్ప‌గా ఉంటుంది అని అర్థ‌మైంది. సినిమా చూసే ప్ర‌తి ఒక్క‌రూ నానిని క్రికెట్ ప‌ర్స‌న్‌గానే చూస్తారు. ఇంత‌కు ముందు క్రికెట్ ఆడేవాళ్ల‌ను చూస్తే `ఏంది వీళ్లు.. బాల్ కొట్ట‌లేక‌పోతున్నారు ` అనుకునేవాడిని. కానీ ఇప్పుడు వాళ్ల క‌ష్టం అర్థ‌మ‌వుతోంది. నేను స్కూల్లో ఉన్న‌ప్పుడు క్రికెట్ ఆడేవాడిని. సినిమా మీద ఆస‌క్తి పెరిగిన త‌ర్వాత నేను క్రికెట్ ఆడ‌టం మానేశా. స‌చిన్ రిటైర్ అయిన త‌ర్వాత అస‌లు క్రికెట్ చూడ‌ట‌మే మానేశా. ఇప్పుడు ఐపీయ‌ల్ వంటివాటిని అస‌లు చూడ‌టం కూడా లేదు. నాకు సినిమానే ప్ర‌పంచం. కానీ ఈ సినిమా కోసం ఆడ‌టం మొద‌లుపెట్టిన త‌ర్వాత‌, గేమ్ ఇంకాస్త అర్థ‌మైన త‌ర్వాత క్రికెట్ అంటే కూడా ఇష్టం మొద‌లైంది. నా కెరీర్‌లో క్విక్‌గా… విన్న వెంట‌నే ఓకే చేసి, వెంట‌నే సెట్స్ మీద‌కు వెళ్లి, అనుకున్న ప్ర‌కారం విడుద‌ల‌కు వ‌చ్చిన సినిమా ఇది.అప్ప‌ట్లో 146 డేస్‌ టు గో అని ఒక పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశాం. దాని ప్ర‌కారం విడుద‌ల చేయ‌గ‌ల‌మా అని మ‌ధ్య‌లో అనుమానాలు వ‌చ్చాయి. కానీ విధి మ‌మ్మ‌ల్ని అనుకున్న తేదికే మీ ముందుకు తీసుకొచ్చి నిలిపింది. ఈ సినిమాలో నేను స‌చిన్ కొడుకును కాదు. సినిమా అంతా మేజ‌ర్‌గా రంజీ మ్యాచ‌స్ మీద ఆధార‌ప‌డి ఉంటుంది. డాన్యుల్ క్రికెట్ అకాడ‌మీలో నేను ప్రాక్టీస్ చేశా. మా ఆఫీస్ ద‌గ్గ‌ర కాబ‌ట్టి, కంఫ‌ర్ట‌బుల్‌గా నేర్చుకున్నా. షూటింగ్‌లో ఒక సారి ముక్కు కూడా ప‌గిలి ప‌క్క‌కు వెళ్లింది. క్రికెట్ ప‌రంగా ఆథెంటిగ్గా నేను చూసిన సినిమాల్లో, అంత డీటైలింగ్‌గా తెలుగులో వ‌చ్చిన తొలి సినిమా `జెర్సీ` అవుతుంది. సినిమా చూస్తుంటే క్రికెట్‌ని లైవ్‌లో చూసిన‌ట్టు అనిపిస్తుంది. ఎక్క‌డా సినిమా కోసం ఆడిన‌ట్టు ఉండ‌దు. ఈ సినిమా ప‌రంగా నాకు ప్ర‌తిదీ కొత్తే. నాకు ఇందులో క్రికెట‌ర్ అర్జున్ క‌థ చెప్ప‌డం అనేది చాలా గ‌ర్వంగా అనిపిస్తుంది. అర్జున్ అనే వాడు నిజంగా ఉన్నాడా? ఇది ఫిక్ష‌న‌ల్ స్టోరీయా అనే డౌట్ అంద‌రికీ వ‌స్తుంది. ఒక‌రి క‌థ చూసి మ‌నం స్ఫూర్తి పొంద‌డం అనేది ఉంటుంది చూశారా.. అది అర్జున్‌ని చూసిన‌ప్పుడు అనిపిస్తుంది. సినిమా చూసిన‌ప్పుడు మాత్రం అర్జున్ క‌థ నిజ‌మ‌నిపిస్తుంది. హైదరాబాద్ ప్లేయ‌ర్‌గా అర్జున్ పాత్ర ఉంటుంది. స్పోర్ట్స్ కోటాలో ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియాలో ప‌నిచేస్తున్న‌ట్టు చూపిస్తాం. 86, 96, 2018 సంవ‌త్స‌రాల‌ను చూపించాం సినిమాలో. సాను, గౌత‌మ్ చేసిన గ్రౌండ్ వ‌ర్క్, స్టోరీ బోర్డ్ వంటివి ఆస‌మ్‌. ఇప్పుడున్న సిట్చువేష‌న్‌లో ఇలాంటి సినిమాను షూట్ చేయ‌డం చాలా క‌ష్టం. అంత ఆథంటిక్ సినిమాను తీయ‌డానికి ప్ర‌ధాన కార‌ణం సాను, గౌత‌మ్‌. వాళ్ల క‌ష్టం చూస్తే మ‌నం ఇంకా క‌ష్ట‌ప‌డాల‌నిపిస్తుంది. వీఎఫ్ ఎక్స్ చాలా బాగా వ‌చ్చాయి. జ్యూక్ బాక్స్ లో ఐదు పాట‌లుంటాయి. ఒక స‌ర్ ప్రైజ్ సాంగ్‌ని సినిమాకు ముందు విడుద‌ల చేస్తాం. అనిరుద్ సంగీతం చాలా ఇష్టం నాకు. అత‌నితో వెంట వెంట‌నే రెండు సినిమాల‌కు ప‌నిచేయ‌డం ఆనందంగా ఉంది. క్లైమాక్స్ మ్యాచ్ 14 రోజులు చేశాం. ప్ర‌తి రోజూ రాత్రి 6.30కి మొద‌లైతే ఉద‌యం వ‌ర‌కు చేసేవాళ్లం. హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల విప‌రీత‌మైన చ‌లి అనిపించింది క‌దా… అప్పుడు షూట్ చేశాం. సినిమాను ప్ర‌స్తుతం తెలుగులో విడుద‌ల చేస్తున్నాం. చైనాలోనూ విడుద‌ల చేయాల‌ని అనుకుంటున్నాం“ అని అన్నారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Leave a Comment