సినిమా

Indian Film Industry: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెయ్యి కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించిన ఐదుగురు హీరోయిన్ లు..!!

Share

Indian Film Industry: ప్రపంచవ్యాప్తంగా సినిమా పరంగా అత్యధిక మార్కెట్ హాలీవుడ్ ఇండస్ట్రీకి ఉంది. ఆ తర్వాత  ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీదే. అందువల్లే హాలీవుడ్ నిర్మాతలు చాలా ధీమాగా వేల కోట్లలో  పెట్టుబడి పెడుతూ… భారీ లాభాలు సాధిస్తారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే పరిస్థితికి లేటెస్ట్ గా  ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చేరుకుంది. దిగ్గజ దర్శకుడు రాజమౌళి పుణ్యమా అతి తక్కువ బడ్జెట్ తో… వేల కోట్ల కలెక్షన్లు వచ్చే పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. “బాహుబలి 2” తో… భారతీయ చలన చిత్ర రంగం యొక్క మార్కెట్ విస్తరించటం మాత్రమే కాదు.. ఇండియన్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా భారీ గిరాకీ ఏర్పడింది. ఒకప్పుడు వందల కోట్లలో కలెక్షన్ లు వస్తే ఇప్పుడు వేల కోట్ల కలెక్షన్లు రావడం ఇందుకు ఒక నిదర్శనం.

Baahubali 2: Anushka Shetty Goes Glam as Princess Devasena In The Sequel, Find Out Her Diet And Fitness Routine - NDTV Food

దీంతో ఇప్పుడు బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు చాలా మంది నిర్మాతలు అదేవిధంగా దర్శకులు పాన్ ఇండియా మార్కెట్ దృష్టిలో పెట్టుకొని.. కథలు సిద్ధం చేస్తూ పెట్టుబడి పెడుతున్నారు. ఆ రీతిగానే రిలీజ్ చేస్తున్నారు. ఈ తరహాలోనే ఇటీవల కొన్ని సినిమాలు వేల కోట్లలో కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో వేల కోట్లలో కలెక్షన్స్ వచ్చిన సినిమాల హీరోలకి మరింత క్రేజ్ పెరుగుతోంది. కానీ ఇటువంటి వేల కోట్లు సాధించిన సినిమాలలో హీరోయిన్ పాత్రలు చేసిన వారికి.. పెద్దగా గుర్తింపు ఏమాత్రం కనబడటం లేదు. అడపాదడపా అవకాశాలు వస్తున్నా గాని హీరోలకంటే హీరోయిన్ నీ పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనబడటం లేదు. Baahubali 2: Sivagami Actress Ramya Krishnan Is 'Overwhelmed' With The Response

రాజమౌళి “బాహుబలి 2”

ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన సినిమాలో హీరోయిన్ లు మొత్తం ఐదుగురు. వాళ్ల వివరాలు చూస్తే… మొట్టమొదటిగా రాజమౌళి దర్శకత్వంలో.. “బాహుబలి 2” లో యువరాణిగా చేసిన అనుష్క శెట్టి. దేవసేనగా అదరగొట్టే పెర్ఫార్మెన్స్ తో బాహుబలి లో అందరిని ఆకట్టుకుంది. దాదాపు వెయ్యి కోట్లకు పైగానే సాధించిన “బాహుబలి 2” లో ఒక హైలెట్ అని చెప్పవచ్చు. ఇక ఇదే సినిమాలో మరో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ. రాజమాత శివగామి దేవి పాత్రలో రమ్యకృష్ణ నటన… ప్రభాస్ తో వచ్చే సన్నివేశాలు సినిమాకే కీలకం. రీ ఎంట్రీ లో రమ్యకృష్ణ బాహుబలి 2 తో ప్రపంచవ్యాప్తంగా హైలెట్ అయ్యింది. వెయ్యి కోట్ల క్లబ్ లో చేరిన హీరోయిన్ గా.. పేరు సంపాదించుకుంది.

Alia Bhatt Quashes Reports Of Being Upset With RRR Team, Slams Haters Saying, “Only Reason I'm Bothering To Clarify This Is Because…”

రాజమౌళి “RRR”

ఇక ఆ తర్వాత ఈ ఏడాది రిలీజ్ అయిన “RRR”. ఈ సినిమాలో ఆలియా భట్ చేసిన హీరోయిన్ పాత్ర చిన్నదే అయినా గాని… బాలీవుడ్ ఇండస్ట్రీ జనాలను సినిమాకి రప్పించడంలో కీలకంగా మారింది. చాలావరకు ప్రమోషన్ కార్యక్రమాల్లో ఆలియాభట్ నీ జక్కన్న ముందుండి నడిపించేశాడు. ఈ సినిమా 1000 కోట్ల కంటే ఎక్కువగానే ప్రస్తుతం సాధిస్తూ ఇంకా థియేటర్లో రన్ అవుతూ ఉంది. దీంతో ఆలియా భట్ కూడా “RRR”తో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరింది.

Dangal actress Sanya Malhotra goes down the memory lane as she shares wrestling practice videos : Bollywood News - Bollywood Hungama

అమీర్  ఖాన్  “దంగాల్”

ఇక ఆ తర్వాత బాలీవుడ్ “దంగాల్”. అమీర్ ఖాన్ హీరోగా కుస్తీ పోటీల నేపథ్యంలో.. అదికూడా ఆడపిల్లలతో.. క్రీడా నేపథ్యం కలిగిన ఈ సినిమా దేశంలోనే 2000 కోట్ల రూపాయలు సాధించిన.. ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్ రికార్డ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా, సన్య సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచారు.

From Daughter To Wife: The Aamir Khan-Fatima Sana Shaikh Love Story

ఈ ఇద్దరు కూడా భారతీయ చలన చిత్ర రంగంలో వెయ్యి కోట్ల క్లబ్ లో హీరోయిన్ లిస్ట్ లో చేరడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు “బాహుబలి 2”, దంగల్, ఆర్ఆర్ఆర్. ఈ మూడింటిలో హీరోయిన్ గా ఐదుగురు చేయటంతో.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెయ్యి కోట్ల క్లబ్ లో స్థానం సంపాదించారు.


Share

Related posts

నా పెళ్లి ఆమెతోనే

Siva Prasad

ఆ ‘బిజినెస్’లోకి అడుగు పెడుతున్న రానా.. ఇక లాభాలే లాభాలు!

Teja

Regina Cassandraa Beautiful Clicks

Gallery Desk
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar