బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ “ఆదిపురుష్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం కథని ఆధారం చేసుకుని సినిమాలో పాటలు ఉంటాయని రాముడిగా ప్రభాస్ నటిస్తాడని, రావణుడితో రాముడు చేసే యుద్ధం తరహాలో ఈ సినిమా ఉంటుందని మొన్నటిదాకా వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాకుండా రాముడు నీలమేఘ శ్యాముడు గా చూపిస్తూ రావణుడికి ఒక ఖచ్చితమైన రూపాన్ని ఇవ్వడం జరిగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ జుట్టు, గడ్డం, మీసం పెంచి మరో లుక్ లో కనిపించబోతున్నాడట.
మరోపక్క రావణుడి క్యారెక్టర్ కూడా పది తలలు కలిగిన క్యారెక్టర్లా కాకుండా వేరే విధంగా డైరెక్టర్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో రామాయణం అని చెప్పి హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే పాత్రలను ఇష్టమొచ్చిన రీతిలో చూపిస్తే గ్యారెంటీ గొడవలు జరగడం ఖాయమని మరోపక్క సినిమా యూనిట్ డైరెక్టర్ ఓం రౌత్ దృష్టికి తీసుకువచ్చారు. అనేక అభ్యంతరాలు సినిమా రిలీజ్ కాకుండా గొడవలు జరుగుతాయి అని చెప్పారట.
దీంతో సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకముందే వివాదం నెలకొనటంతో ప్రభాస్ తలపట్టుకున్నట్లూ… సమాచారం. ఇదిలా ఉండగా అసలు రామాయణంతో సంబంధం లేని కథ మైథాలాజికల్ ఫ్యాంటసీ టైపులో సినిమా చేయాలని తాజాగా డైరెక్టర్ భావిస్తున్నట్లు సమాచారం. మరోపక్క సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ రాముడిగా ఉంటుందని నాగ్ అశ్విన్ తెలపడం జరిగింది. ఇలాంటి తరుణంలో సినిమాకి సంబంధించి మొదటిలోనే వివాదం అన్నట్లు పరిస్థితి రావడంతో ప్రభాస్ కొంత టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!