సీజన్ ఫోర్ బిగ్ బాస్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. బిగ్ బాస్ ఇస్తున్న రకరకాల టాస్క్ లో చూస్తున్న ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఒకపక్క ఐపీఎల్ సీజన్ కొనసాగుతుండగానే బిగ్‌బాస్ రేటింగులు పడిపోకుండా షో నిర్వాహకులు ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతున్నారు. షో పై చూస్తున్న జనాలకు ఇంట్రెస్ట్ పోకుండా సరికొత్త రిలేషన్స్ ఏర్పడే రీతిలో సీజన్ ఫోర్ ని రక్తి కట్టిస్తున్నారు. ఇదిలా ఉండగా హౌస్ నుండి ఎలిమినేట్ అవుతున్న కంటెస్టెంట్ లు ఎక్కువ చేస్తున్న కామెంట్ అఖిల్ మరియు మోనాల్ పై కావటంతో సోషల్ మీడియాలో వీరిద్దరిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
ఇంటి నుండి ఎలిమినేట్ అయిన చాలా మంది సభ్యులు అఖిల్ ఫోకస్ అంతా గేమ్ పై కాకుండా మోనాల్ పై ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో అఖిల్ తండ్రి తన కొడుకు పై వస్తున్న కామెంట్లకు స్పందించారు. షోలో తన కొడుకు అఖిల్ బాగా రాణిస్తున్నారని అదే విధంగా అభివృద్ధి కూడా బాగా ఆడుతున్నారని ఇద్దరిని చూస్తే బ్రదర్స్‌లా అనిపించారు. పేర్లు కూడా అఖిల్ (A), అభిజిత్ (A) ఉండటం బాగా అనిపించింది. ఇదిలా ఉండగా తన కొడుకు షోలో ఆడుతున్న వ్యవహారం చూసి బంధువులు తనని గుజరాత్ రాష్ట్రానికి చెందిన అమ్మాయిని కోడలు పిల్లగా తీసుకొస్తున్నవా అని అడుగుతున్నారు అంటూ అఖిల్ నాన్న చెప్పుకొచ్చారు.
అయితే తన కోడలు పిల్లగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన అమ్మాయినే.. అఖిల్ కి ఇచ్చి పెళ్లి చేస్తాను అని, షో నుండి వచ్చాక అఖిల్ పెళ్లి ఖచ్చితంగా అయిపోతుందని పేర్కొన్నారు. మరో పక్క హౌస్ లో ఉన్న అఖిల్ మాత్రం బిగ్ బాస్ టైటిల్ కోసం కాకుండా మోనాల్ కోసమే అన్నట్టుగా ఆటాడుతున్నాడు. తన ఫోకస్ మొత్తం మోనాల్‌పైనే పెడుతూ.. ఆమెతో ఎవరైనా మాట్లాడినా, కనీసం డాన్స్ చేసినా కూడా తట్టుకోలేక ఏడ్చేంత పని చేస్తున్నారు. ఈ విధంగా గేమ్ ఆడితే అఖిల్ గేమ్ ఆడుకుంటూ పోతే మరి చివరాకరికి ఏమవుతడో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!