ముహూర్తం కుదిరింది…


`సింహా`, `లెజెండ్` చిత్రాల త‌ర్వాత నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగ‌తి తెలిసిందే. బాల‌కృష్ణ న‌టిస్తున్న 104వ చిత్ర‌మిది. త‌న స్వంత బ్యాన‌ర్ ఎన్‌.బి.కె.ఫిలింస్‌లో బాల‌కృష్ణ ఈ సినిమాను నిర్మించాల‌నుకున్న‌ప్ప‌టికీ `య‌న్‌.టి.ఆర్‌` బ‌యోపిక్ నిర్మాత‌గా ఇచ్చిన షాక్‌తో ఈ సినిమా నిర్మాణ ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌న పెట్టేశాడు బాల‌య్య‌. ఇప్పుడు ఈ సినిమాను సి.క‌ల్యాణ్ నిర్మిస్తాడని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సినిమా అధికారికంగా ప్ర‌క‌ట‌న వ‌చ్చింది. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారంమార్చి 28న లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు చేస్తారు. అయితే సినిమా మాత్రం ఎన్నిక‌లు త‌ర్వాతే సెట్స్‌లోకి వెళుతుంద‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. `సింహా`, `లెజెండ్` త‌ర్వాత ఈ కాంబినేష‌న్‌లో రానున్న సినిమా కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.