RRR: రిలీజ్‌కు రెండు డేట్స్ ఫిక్స్..ఒకటి మిస్ అయితే మరొకటి పక్కా అని బ్లైండ్‌గా నమ్మొచ్చు. తాజాగా దీనికి సంబంధించిన బిగ్ సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చింది ఆర్ఆర్ఆర్ టీమ్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాను జనవరి 7న రిలీజ్ చేయాలనుకున్న సంగతి తెలిసిందే. కానీ, కరోనా థర్డ్ వేవ్ కారణంగా మళ్ళీ వాయిదా పడింది. అంతక ముందు మూడుసార్లు పోస్ట్ పోన్ అయిన ఆర్ఆర్ఆర్ మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యేసరికి అందరిలో తీవ్ర అసంతృప్తి కలిగింది. మళ్ళీ ఎప్పుడెప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేస్తారంటూ ప్రతీ ఒక్కరు ఆతృతగా చూస్తున్నారు.
ఆ ఎదురు చూపులు ఫలించాయి. ఈ సినిమా రిలీజ్ కోసం ఏకంగా రెండు డేట్ ఫిక్స్ చేశారు రాజమౌళి బృందం. దీనికి సంబంధించిన తాజా అప్డేట్లో హీరోలుగా నటిస్తున్న ఎన్.టి.ఆర్, రాం చరణ్‌లతో కూడుకున్న పోస్టర్‌ను వదిలారు. దీనిపై రెండు డేట్స్ ప్రకటించారు. అందులో ఒకటి మార్చ్ 18 కాగా, మరొకటి ఏప్రిల్ 28. పరిస్థితులన్నీ సద్దుమణిగితే మార్చ్ 18న ముందు ప్రకటించిన మాదిరిగానే 14 భాషలలో ఒకేసారి రిలీజ్ చేసేస్తారు. ఒకవేళ గనక అప్పటికి పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు గనక రాకపోతే ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తారు. కానీ ఈ రెండు తేదీలలో మాత్రం ఆర్ఆర్ఆర్ ఈ సారి రిలీజ్ కావడం పక్కా.
RRR: రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో.
పోరాట యోధులు అల్లూరి సీతారామరాజు, కొమురమ్ భీమ్ జీవిత కథలకు ఫిక్షనల్ డ్రామాను కలిపి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రాజమౌళి రూపొందించారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ చరణ్ సరసన సీత పాత్రలో కనిపిస్తోంది. తారక్ సరసన బ్రిటన్ మోడల్ ఓలివియా మోరిస్ కనిపించబోతుండగా, అజయ్ దేవగణ్, శ్రియ శరణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!