5th ఎస్టేట్ న్యూస్ రాజ‌కీయాలు

Vallabhaneni Vamsi: గన్నవరం సీటు పై హ్యాండ్ ..!? కృష్ణాజిల్లా పాలిటిక్స్ ట్విస్ట్..!?

Share

Vallabhaneni Vamsi: కృష్ణాజిల్లాలోని కొన్ని నియోజకవర్గాలపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. కచ్చితంగా ఈ నియోజకవర్గాల్లో గెలవాల్సిందే..! ఆ వైసీపీ ఎమ్మెల్యే లు ఓడించాల్సిందే..! అన్న పట్టుదలతో టిడిపి ఉంది. అందులో ప్రత్యేకంగా గుడివాడ, గన్నవరం నియోజక వర్గాలు ఉన్నాయి. ఈ రెండు నియోజకవర్గాల నుండి కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. గుడివాడలో కొడాలి నాని చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఆయనను ఓడించటం చాలా కష్టం. అక్కడ క్యాండెట్ ఎవరు అవుతారు..? అనేది టిడిపి నుండి డిసైడ్ కాలేదు. టిడిపి రకరకాల అంచనాలు వేస్తోంది. సర్వేలు చేయిస్తుంది. రిపోర్టులు తప్పించుకుంటుంది. గుడివాడలో ఎవర్ని నిలపాలి అనేదానిపై చంద్రబాబు ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. ప్రస్తుతం ఇంచార్జి గా అయితే రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. కానీ అభ్యర్థిని మార్చే అవకాశం ఉంది.

Vallabhaneni Vamsi: గన్నవరంలో పోటీపై అనుమానాలు

గన్నవరం లో వల్లభనేని వంశీ టిడిపి నుంచి గెలిచి వైసీపీ కి వెళ్లారు. టిడిపి నుంచి ఎవరు పోటీ చేస్తారు..? అనేది ఇప్పు టి వరకు క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇంచార్జి గా బచ్చుల అర్జునుడు ఉన్నారు. ఇక్కడ ఆయనకు కాకుండా వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. టిడిపి విషయం పక్కన పెడితే… వైసీపీ నుంచి గుడివాడలో కొడాలి నాని పోటీ చేయటం కన్ఫర్మ్. మరి గన్నవరం నుండి ఎవరు పోటీ చేస్తారు..? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఇక్కడ నుండి వల్లభనేని వంశీ పోటీ చేస్తారా..? ఆయనకే వైసీపీ టికెట్ ఇస్తుందా..? లేక 2014లో పోటీ చేసి ఓడిపోయిన దుట్టా రామచంద్ర రావు కి టికెట్ ఇస్తారా..? లేక 2019లో పోటీ చేసి అతి తక్కువ మెజార్టీతో ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్ రావు కి పార్టీ టికెట్ ఇస్తుందా..? అనే అనుమానాలు ఉన్నాయి.

 

గన్నవరం నియోజకవర్గంలో మూడు గ్రూపులు

ప్రస్తుతం గన్నవరం నియోజకవర్గంలో మూడు గ్రూపులు ఉన్నాయి. ఎమ్మెల్యే వంశీ ఒక గ్రూపు, యార్లగడ్డ వెంకట్రావు ది ఒక గ్రూపు, దుట్టా రామచంద్ర రావు ది మరో గ్రూపు. ఇలా మూడు గ్రూపులు వైసీపీలో ఉన్నాయి. వల్లభనేని వంశీ 2014, 2019 ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచారు. 2014 నుండి 2019 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు వల్లభనేని వంశీ.. జగన్మోహన్ రెడ్డి ని టార్గెట్ చేస్తూ అనేక సార్లు విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగతంగానూ కామెంట్స్ చేశారు. సాక్షి పత్రికలో కథనాలపై భారతి పేరును తీసుకువచ్చి విమర్శలు చేశారు. గతంలో వంశీ మాట్లాడిన వీడియోలు ఇప్పుడూ సోషల్ మీడియాలో ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబుపైనా లోకేష్ పైనా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ వంశీ మంచి టాకిటో. మంచి వక్త. మాట్లాడగల సమర్ధత ఉంది. ఎవరినైతే వ్యతిరేకిస్తారో ఆయనపై వ్యతిరేక భావజాలం ప్రదర్శించగలగడంలో దిట్ట. అతని పట్ల చెడుగా మాట్లాడటంలో దిట్ట. సూటిగా స్పష్టంగా కొంత వ్యంగ్యంగా విమర్శించడంలో వల్లభనేని వంశీ దిట్ట. సో.. ఆయనేదో చంద్రబాబు, లోకేష్ ను తిడుతున్నారని జగన్మోహనరెడ్డి కరిగిపోయి తిరిగి టికెట్ గన్నవరం కన్ఫర్మ్ చేస్తారు అని అనుకోలేము. ఇక్కడ యార్లగడ్డ వెంకట్రావు వర్గం బలంగా ఉంది కాబట్టి కశ్చితంగా ఆయన పోటీ చేస్తానని అంటున్నారు.

విజయవాడ ఎంపీ స్థానానికి ఆలోచన..?

మరో వైపు చూసుకుంటే విజయవాడ ఎంపీ స్థానానికి వైసీీపిీ నుండి ఎవరూ లేరు. విజయవాడ ఎంపి అభ్యర్ధిగా 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పీవీపీ ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. ఆయన మళ్లీ విజయవాడ వైపు దృష్టి పెట్టడం లేదు. వైసీపీలో కూడా యాక్టివ్ గా లేరు. అందుకే కొత్తగా వినిపిస్తున్న ప్రతిపాదనలు ఏమిటంటే.. వంశీని విజయవాడ ఎంపీగా పంపిస్తారు. గన్నవరం సీటు దుట్టా కు గానీ లేక యార్లగడ్డ కు గానీ ఎవరికో ఒకరికి ఇస్తారు అన్న మాటలు వినబడుతున్నాయి. వంశీ వర్గం మాత్రం ఆయన కశ్చితంగా 2024 ఎన్నికల్లో గన్నవరం నుండే పోటీ చేస్తారు అని చాలా స్ట్రాంగ్ గా చెబుతోంది. కొంత మంది మాత్రం వంశీ టీడీపీలోకి వస్తారని అనుకుంటున్నా అది అయ్యే పని కాదు. టీడీపీ వాళ్లు తీసుకునే అవకాశం లేదు. అటు వంశీ కూడా టీడీపీలోకి చేరే ఆలోచనలో లేరు.

సామాజిక సమీకరణాల దృష్ట్యా

పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ఏమిటంటే.. వంశీకి విజయవాడ ఎంపీ సీటు ఆఫర్ చేస్తున్నారుట.. ఎందుకంటే వల్లభనేని వంశీ 2009లో టీడీపీ తరపున విజయవాడ పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు విజయవాడ నగరంతో పాటు అటు గన్నవరం, అటు జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సామాజిక సమీకరణాలు కూడా వంశీకి కలిసి వస్తాయి. ఇవన్నీ కలిసివస్తాయి కాబట్టి వల్లభనేని వంశీకి కఛ్చితంగా విజయవాడ పార్లమెంట్ టికెట్ ఇస్తారు అని వైసీపీలోని ఒక వర్గం చెబుతుంటే వంశీ వర్గం మాత్రం గన్నవరం నుండే వంశీ పోటీ చేస్తారనీ, అవసరమైతే విజయవాడ పార్లమెంట్ సీటు యార్లగడ్డకు ఇస్తారు కానీ వంశీ సీటు మార్చరు అని చెబుతోంది. ఇలా వల్లభనేని వంశీ పరిస్థితి కాస్త క్వచ్చన్ మార్క్ గానే ఉందని చెప్పుకోవచ్చు.


Share

Related posts

కరోనా కట్టడికి టీటీడి తీసుకున్న చర్యలు

Siva Prasad

KCR: కేసీఆర్ ను కొత్త‌గా ఇరికిస్తున్న ర‌ఘునంద‌న్ రావు

sridhar

బ్రేకింగ్ : అసెంబ్లీ లో ఓటు వేసిన జగన్ – రెడీ గా ఉన్న ఆ నలుగురు…!

arun kanna
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar