బిగ్‌బాస్ 6 స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే బిగ్‌బాస్ షో తెలియనివారు ఉండరు. ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఇప్పుడు ఆరో సీజన్లోకి అడుగుపెట్టబోతుంది. గత ఏడాది ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అయిన డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో 24 గంటలు ప్రసారమైన ఈ షో బాగానే నడిచింది. ఈ ఏడాది మాత్రం బుల్లితెరపైనే ప్రసారం కానుంది. ఈ సీజన్ సెప్టెంబర్ 4న సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుందని విశ్వసనీయ సమాచారం. అయితే ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 6లో ఒక స్టార్ యాంకర్ అడుగుపెట్టనుందని, ఆమె భారీగా రెమ్యునరేషన్ తీసుకోనుందని వార్తలు వస్తున్నాయి. అలానే మిగతా పార్టిసిపెంట్స్ ఎవరనేది కూడా టీవీ వర్గాల్లో వెల్లడైంది.
బిగ్‌బాస్ 6 కంటెస్టెంట్స్ వీరేనా
స్టార్ స్పోర్ట్స్‌లో టీవీ ప్రెజెంటర్‌గా పనిచేస్తున్న నేహా చౌదరి, కమెడియన్ చలాకీ చంటి, ఈటీవీ ఢీ ఫేమ్ వర్షిణి, సింగర్ గీతా మాధురి భర్త నందు, యాంకర్ ప్రత్యూష, కమెడియన్ అప్పారావు, గలాటా గీతూ రాయల్, శ్రీహన్ ఈసారి సందడి చేయనున్నారని సమాచారం. ఇకపోతే కొద్దిరోజుల క్రితమే బిగ్‌బాస్ ప్రోమో రిలీజ్ అయి ప్రేక్షకులను అభిమానులను ఆకట్టుకుంటుంది. అయితే షో ఎప్పుడు ప్రారంభమవుతుందో అధికారికంగా వెల్లడించలేదు. గత రెండు సీజన్ల లాగానే ఈ సీజన్ కూడా లేదా సెప్టెంబర్ నెలలో లాంచ్ చెయ్యొచ్చని టాక్. అలాగే ఈసారి కూడా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ 10 రోజులు ముందే క్వారంటైన్లో ఉంటారు. ఇదిలా ఉండగా, ఈసారి కూడా బిగ్‌బాస్ సీజన్‌కి నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
ఉదయభాను హైయ్యెస్ట్ రెమ్యునరేషన్
సీనియర్ యాంకర్ ఉదయభాను బిగ్‌బాస్ సీజన్ 6 కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇస్తుందని టాక్. ఈ హాట్ భామ రెండున్నర దశాబ్దాల నుంచి బుల్లితెరపై వినోదం పంచుతోంది. ఇప్పుడు కూడా కొన్ని షోలలో యాంకరింగ్ చేస్తుంది. అసలైతే ఆమె ఎప్పుడో బిగ్‌బాస్ లో పాటిస్పేట్ చేసి ఉండాల్సింది కానీ ఆమెకు చిన్నపిల్లలు ఉండడంతో అప్పుడు వెళ్లలేకపోయింది. ఇప్పుడు ఆమె ఇద్దరమ్మాయిలు పెద్దవాళ్లు కావడంతో ఎలాంటి టెన్షన్ లేకుండా హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడానికి ఓకే చెప్పిందట. బిగ్‌బాస్ సీజన్ 6లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటోంది ఈమేనట. ఈ తారకు రోజుకి రూ.లక్షల్లోనే రెమ్యునరేషన్ ఇస్తున్నారని, ఇప్పటివరకు జరిగిన సీజన్లో ఏ కంటెస్టెంట్ అంత రెమ్యునరేషన్ తీసుకోలేదని టాక్ నడుస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!