NewsOrbit
Entertainment News సినిమా

గన్ లైసెన్స్ అప్లై చేసిన బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..!!

Share

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నీ ఇటీవల చంపేస్తామని కొంతమంది దుండగులు లెటర్ రాయడం జరిగింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇది సంచలనం రేపింది. పంజాబ్ రాష్ట్రంలో సింగర్ నీ చంపిన రీతిలో చంపుతామని.. బెదిరించారు. దీంతో అప్పటి నుండి సల్మాన్ ఖాన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆ సమయంలో ముంబై పోలీసులు సల్మాన్ కి ప్రత్యేక భద్రత కూడా కేటాయించినట్లు వార్తలు వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ ముంబై పోలీస్ కమిషనర్ కి గన్ లైసెన్స్ కి సంబంధించి… దరఖాస్తు చేసి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. సల్మాన్ స్వయంగా వెళ్లి అప్లికేషన్ ఇవ్వటం జరిగింది.

Bollywood hero Salman Khan applied for gun license..!!

ఇది ఇలా ఉంటే సల్మాన్ ఖాన్ కి దుండగుల నుండి ఫోన్ కాల్స్ కూడా వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. జింక కేసులకు సంబంధించి.. త్రెట్ ఇంకా వెంటాడుతున్నట్లు మరోపక్క టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా ప్రస్తుతం మాత్రం సల్మాన్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి అని రకాలుగా రెడీ కావడం జరిగింది. ఈ క్రమంలో సల్మాన్ ప్రైవేటు సెక్యూరిటీ కూడా అలర్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. సల్మాన్ ఖాన్ ఇటీవలే తన కొత్త సినిమాలకు సంబంధించి షూటింగ్ కార్యక్రమాలకు హైదరాబాద్ వచ్చారు.

Bollywood hero Salman Khan applied for gun license..!!

రామోజీ ఫిలిం సిటీలో.. షూటింగ్ జరిగింది. ఆ సమయంలో పూర్తి భద్రత వలయంలో సల్మాన్ ఖాన్ షూటింగ్ జరిగినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ అప్పట్లో వచ్చింది. ప్రస్తుతం “కబి ఈద్ కబి దివాలి” అనే సినిమాతో పాటు “టైగర్ 3” సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు చిరంజీవి నటించిన “గాడ్ ఫాదర్” లో కూడా సల్మాన్ కీలక పాత్ర పోషించడం జరిగింది. సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి సినిమాలో గ్యాంగ్ స్టార్ పాత్రలో సల్మాన్ నటించినట్లు టాక్. ఏదేమైనా ప్రస్తుతం ముంబైలో వరుస పెట్టి షూటింగ్లలో సల్లు భాయ్ పాల్గొంటున్నారట. దీంతో బెదిరింపుల లెటర్ కారణంగా ముందు జాగ్రత్తగా సల్మాన్ గన్ లైసెన్స్ కి అప్లై చేశారట.


Share

Related posts

Liger : లైగర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన పూరి టీం..!

GRK

Megastar chiranjeevi: మెగాస్టార్‌కి మారుతి లైన్ చెప్పి ఒప్పించాడా..అలా అయితే లైన్‌లో చాలా మంది ఉంటారే..?

GRK

RRR: “ఆర్ఆర్ఆర్” నార్త్ ఇండియా కలెక్షన్ డీటెయిల్స్..!!

sekhar