KGF: “కేజిఎఫ్” మొదటి చాప్టర్ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ సినిమా హీరో యాష్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కి ఎంత పేరు వచ్చిందో అదే రీతిలో నిర్మాణ సంస్థ హొమ్మబల్ కి కూడా రావడం జరిగింది. మొదటి చాప్టర్ కన్నడలో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయ్యి మిగతా చోట్ల డబ్ అయి అదే రీతిలో విజయం సాధించింది. ఊహించని రీతిలో కలెక్షన్లు వచ్చాయి. దీంతో మొదటి చాప్టర్ సాధించిన విజయంతో సెకండ్ చాప్టర్ కి అరె టింకు ఉత్సాహంతో సినిమా నిర్మాణ సంస్థ దాదాపు 100 కోట్లు ఖర్చు పెట్టగా… విడుదలైన వారం రోజులకే 700 కోట్లు కలెక్ట్ చేయడం సంచలనంగా మారింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
దీంతో సినిమా ఓవరాల్ గా థియేట్రికల్ రన్ టైం లో… మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హొమ్మబల్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయడానికి మంతనాలు జరుపుతున్నట్లు సరికొత్త టాక్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లో వినపడుతోంది. ఆల్రెడీ ప్రభాస్ తో “సలార్” ప్రాజెక్ట్ చేస్తోంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పాటు ప్రభాస్ హీరో అనే సరికి ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇక ఇదే సమయంలో “కేజిఎఫ్” నిర్మాణ సంస్థ… మహేష్ బాబుతో ఒక పాన్ ఇండియా సినిమా చేయాలని… ఇందుకోసం మహేష్ కి భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ నీ తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు కథ ఓకే అయితే తే త్వరలోనే అధికారిక ప్రకటన.. రానున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం మహేష్ “సర్కారు వారి పాట” సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నాడు. ఆ తర్వాత రాజమౌళి తో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్టులు అయిపోయాక కథ ఓకే అయితే “కేజిఎఫ్” నిర్మాణ సంస్థతో మహేష్ పని చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!