స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో ఇప్పటి వరకు చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ రో్ల్స్లో గోనగన్నారెడ్డి పాత్ర ఒకటి. `రుద్రమదేవి` చిత్రంలో బన్ని చేసిన పాత్ర ఇది. తెలంగాణ యాసలో గమ్మునుండవోయ్.. అంటూ చెప్పిన డైలాగ్స్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ గోనగన్నారెడ్డి లుక్‌తో హీరో నవదీప్ బన్నికి ఓ గిఫ్ట్ ఇ్వవాలనుకున్నాడు. అందుకోసమని ఓ విగ్రహాన్ని తయారు చేయించాడు. `బావకు ప్రేమతో చిరు కానుక` అంటూ ట్యాగ్ చేశారు. దీనికి అల్లు అర్జున్ స్పందించారు ఔ! బావా గోనగన్నారెడ్డి అంటూ రిప్లై ఇచ్చారు.
బన్ని, నవదీప్ కలిసి ఆర్య2లో నటించారు. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. బావ బావ.. అని పిలుచుకునేంత సానిహిత్యం ఉంది మరి. ఇప్పుడు బన్ని చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!