Aacharya: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఒక్క పరాజయం లేని డైరెక్టర్ జాబితాల్లో కొరటాల శివ ఒకరు. శివ దర్శకత్వంలో వచ్చిన “మిర్చి”, “జనతాగ్యారేజ్”, “శ్రీమంతుడు”, “భరత్ అనే నేను”… టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాలుగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో చిరంజీవి, చరణ్ తో కొరటాల శివ “ఆచార్య” చేయడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఏప్రిల్ 29 వ తారీకు విడుదల కానుంది. దీంతో “ఆచార్య” ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం చురుగ్గా సాగుతున్నాయి. ఒకపక్క సినిమాలో హీరోగా 40 నిమిషాల పాత్ర చేసిన చరణ్ మరోపక్క నిర్మాతగా కూడా రాణించడంతో “ఆచార్య” ప్రమోషన్ కార్యక్రమాలలో కీలకంగా రాణిస్తున్నారు. మొన్ననే చిరంజీవి… కొరటాలతో కూర్చున్న చరణ్ తాజాగా.. కొరటాల శివ తో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ సందర్భంగా డైరెక్టర్ కొరటాల పనితనం గురించి చరణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొరటాల చాలా చిన్న ఎక్స్ప్రెషన్ తో… సన్నివేశం మొత్తానికి మరింత కలరింగ్ వచ్చేలా… ఆయన చెప్పే విధానం బాగా నచ్చుతుందని తెలిపారు. సినిమాలో పొలంలో ఒక ఫైట్ లో… శివ గారు చెప్పిన విధానం అద్భుతం అని.. ఇండస్ట్రీలో ఈ తరహాలో దర్శకుడు ఎవరు ఉండరు అని వివరించారు. “శ్రీమంతుడు” లో అదేవిధంగా “జనతా గ్యారేజ్” లో టోటల్ గా కొత్త మహేష్ ని అదేవిధంగా కొత్త తారక్ నీ శివ గారు చూపించారు. ముఖ్యంగా తారక్ “టెంపర్”…కి “జనతా గ్యారేజ్” కి చాలా వేరియేషన్ ఉంటుంది. “జనతా గ్యారేజ్” లో తారక్ నాకు చాలా నచ్చాడు. ఇప్పుడు ఇదే తరహాలో “ఆచార్య” లో కూడా చాలా సందర్భాలలో దర్శకుడిగా కొరటాల శివ… హీరోల నుండి ఎటువంటి ఔట్ పూట్ రాబట్టలో .. సన్నివేశాలు హైలెట్ అవ్వాలో ఆరీతిగా అద్భుతంగా డీల్ చేశారు..అని రామ్ చరణ్ తేజ్..కొరటాల నీ పొగడ్తలతో ముంచెత్తారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
“ఆచార్య” లో క్యారెక్టర్ చెప్పినప్పుడు ఒకలా ఉంటే చేస్తున్నప్పుడు మరింత కష్టం అనిపించింది అని.. ఆ తరహాలో సినిమా చాలా అద్భుతంగా వచ్చేలా కొరటాల శివ… నడిపించారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. ఫస్ట్ టైం చిరంజీవి..చరణ్.. కలసి ఎక్కువసేపు నటించిన సినిమా కావడంతో ఈ సినిమా చూడటానికి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. పైగా ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తుండటంతో… సెంటిమెంట్ పరంగా.. ఆచార్య హిట్ అని అంటున్నారు. ఎందుకంటే చిరంజీవి సినిమాలకు మణిశర్మ .. సంగీతం అందించిన ఈ సినిమాలో దాదాపు హిట్ అయ్యాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!