బలగం సింగర్ మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న సంగతి తెలిసిందే. గత కొద్ది సంవత్సరాల నుండి అనారోగ్యంతో బాధపడుతూ.. వారానికి మూడు రోజులు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మొగిలయ్యకు కరోనా సోకటంతో రెండు కిడ్నీలు కూడా పాడైపోయాయి. దీంతో కంటి చూపు కూడా మందగించింది. పైగా ఎప్పటినుంచో బీపీ షుగర్.. ఉండటంతో ఆ ఎఫెక్ట్ మిగతా అవయవాలపై పడింది. మొగిలయ్య, కొమురమ్మ దంపతులు బలగం సినిమా కోసం చాలా రోజులు పని చేశారు. ఆ టైంలో అనారోగ్యం సహకరించక అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. ఒకరోజు రోడ్డు ప్రమాదం సంభవించడంతో చెయ్యి కూడా విరిగింది.
హాస్పిటల్ కి తీసుకెళ్తే చెయ్యి పెరిగిందని కిడ్నీ సమస్య ఉందని డాక్టర్లు చెప్పారు. టెస్టులు చేస్తే రెండు కిడ్నీలు ఫెయిల్ అయినట్లు డయాలసిస్ చేయటం కంపల్సరి అని చెప్పడం జరిగింది. అప్పటినుండి అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 రోజుల కిందట మొగిలయ్య రెండు కళ్ళు పూర్తిగా దెబ్బతిన్నాయి. డయాలసిస్ చేసే క్రమంలో..మొగిలయ్యకు చాతి మీద నుంచి రక్తం ఎక్కిస్తున్నారు. డాక్టర్ మల్లేష్ ఆధ్వర్యంలో ఆరోగ్య శ్రీ ద్వారా డయాలసిస్ ఉచితంగా అందిస్తున్నారు. అయినా గాని ఆరోగ్య పరిస్థితి దయనీయంగా ఉండటంతో ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముందుకు రావడం జరిగింది.
మొగిలయ్య కంటి చూపు తిరిగి రప్పించడానికి తనవంతుగా సహాయం చేయడానికి చిరంజీవి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా బలకం డైరెక్టర్ వేణుకి ఫోన్ చేసి..మొగిలయ్య కంటి చూపు కోసం ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని హామీ ఇవ్వటం జరిగిందట. దీంతో వెంటనే ఈ విషయాన్ని వేణు…మొగిలయ్య దృష్టికి తీసుకెళ్లారట. ఇక ఇదే సమయంలో తెలంగాణ మంత్రి హరీష్ రావు ఇంకా దయాకర్ రావు కూడా ప్రభుత్వం తరఫున సహాయం చేయడానికి ముందుకు రావడం జరిగింది అంట. ఈ విషయాన్ని మొగిలయ్య భార్య తెలియజేయడం జరిగింది. దళిత బంధు పథకం ద్వారా కుటుంబాన్ని ఆదుకోవడానికి తెలంగాణ మంత్రులు ముందుకు వచ్చినట్లు స్పష్టం చేసింది. దీంతో ఆర్థికంగా.. వైద్య ఖర్చులు భారం తగ్గనున్నాయని పేర్కొంది.