తెలుగులో కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వెయ్యి సినిమాల్లో నటించిన అలీ స్టార్ కమెడియన్‌గా తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే దక్షిణాదిన తెలుగు, తమిళ చిత్రాలకే అలీ పరిమితం అయ్యారు. అయితే తొలిసారి బాలీవుడ్ సినిమాల్లోకి ఆయన ఎంట్రీ ఇస్తున్నారు.
‘వాంటెడ్’ తర్వాత సల్మాన్‌ఖాన్, ప్రభుదేవా కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘దబాంగ్ 3’. ఈ సినిమాలో సల్మాన్‌ఖాన్ పోలీస్ ఆఫీసర్ అనే సంగతి తెలిసిందే. ఇందులో అలీ కానిస్టేబుల్‌గా నటిస్తున్నారు. చిత్రీకరణ సమయంలో అలీ తన కుటుంబ సభ్యులతో వెళ్లి సల్మాన్‌ఖాన్‌ను కలిశారు. అయితే ఇన్నేళ్ల తర్వాత అలీ బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడం విశేషం. మరి దబాంగ్ 3తో బాలీవుడ్లో కూడా అలీ కమెడియన్‌గా సత్తా చాటుతాడేమో చూద్దాం.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!