Entertainment News న్యూస్ సినిమా

Rajusrivastava: 40 రోజులు ప్రాణాలతో పోరాడి మృతి చెందిన కమెడియన్ రాజు శ్రీవాస్తవ..!!

Share

Rajusrivastava: గత కొద్ది సంవత్సరాల నుండి సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు మరణిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 11వ తారీకు సీనియర్ నటుడు సీనియర్ రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించడం తెలిసిందే. అంతకుముందు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ.. క్షణాలలోనే మరణించడం జరిగింది. సరిగ్గా ఇప్పుడు ఇదే తరహాలో ప్రముఖ స్టాండప్ కమెడియన్ రాజు శ్రీవాస్తవ(58) అనారోగ్యంతో ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. గత నెల ఆగస్టు 10వ తారీఖు జిమ్ లో వర్క్ అవుట్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన శ్రీవాస్తవ.. ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ కావడంతెలిసిందే.

Comedian Raju Srivastava died after fighting for his life for 40 days
Riprajusrivastava

అప్పటినుండి ట్రీట్మెంట్ తీసుకుంటున్న .. గాని ఆరోగ్యం చాలావరకు విషమించటంతో ఈరోజు మరణించారు. శ్రీవాస్తవ యూపీ ఫిలిం డెవలప్మెంట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ అవకాశాలు అందుకుని ప్రముఖ కమెడియన్ గా తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని రంగుల ప్రపంచంలో అనేకమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి శ్రీవాస్తవ.. మరణించడంతో ఆయన అభిమానులు శోక సంద్రం లోకి వెళ్లిపోయారు.

Comedian Raju Srivastava died after fighting for his life for 40 days
Riprajusrivastava

శ్రీవాస్తవ చనిపోయినట్లు అరగంట క్రితం కుటుంబ సభ్యుల నుండి నాకు ఫోన్ వచ్చింది. నిజంగా ఇది చాలా దురదృష్టకరమైన వార్త. దాదాపు 40 రోజులకు పైగా ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడాడు. చివర ఆఖరికి ఈరోజు ఉదయం 10:20 గంటలకు మరణించినట్లు.. రాజు శ్రీవాస్తవ సోదరుడు డిపి శ్రీవాస్తవ.. సోషల్ మీడియా ద్వారా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హిందీ చిత్రాలలో .. మైనే ప్యార్ కియా, బాజీగర్, బాంబే టు గోవా.. వంటి వాటిలో రాజు శ్రీవాస్తవ నటించడం జరిగింది. అతను హిందీ బిగ్ బాస్ సీజన్ 3 లో కంటెస్టెంట్‌గా కూడా పాల్గొన్నారు. స్టాండ్-అప్ కమెడియన్‌లలో రాజు శ్రీవాస్తవ విజయవంతంగా రాణించి చెరగని ముద్ర వేసుకున్నారు.


Share

Related posts

‘అధీర్’ వ్యాఖ్యలపై ఉభయ సభల్లో దుమారం.. మరో ముగ్గురు రాజ్యసభ ఎంపీలపై వేటు

somaraju sharma

ఉప ప్రధాని రేసులో తెలంగాణ సీఎం కేసీఆర్.. అందుకే జగన్ కు మద్దతు.. ఇక జాతీయ రాజకీయాల్లో పాగా?

Varun G

AP Dy CM Puspa Sreevani: డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి బిగ్ రిలీఫ్..

somaraju sharma