పవన్ సినిమా టైటిల్ ఇన్ డైరెక్ట్ గా క్రిష్ చెప్పేశాడా…??

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమా ప్రాజెక్టు ఒప్పుకుని మెగా అభిమానుల మొత్తం ఆకలి తీర్చడానికి ప్రస్తుతం వ్యవహారం నడిపిస్తున్నట్లు ఉంది. గత కొంత కాలం నుండి రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ దాదాపు రెండు సంవత్సరాల పాటు వెండి తెరపై కనిపించలేదు. అయితే ఈ ఏడాది ప్రారంభంలో సినిమాలను లైన్ లో పెట్టి ఐ యాం బ్యాక్ అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం వరుస క్రేజీ ప్రాజెక్టులలో బిజీ అవుతున్నారు.

Pawan Kalyan teams up with director Krish for period drama; see first  poster - Entertainment News , Firstpost“వకీల్ సాబ్” అనే సినిమా చాలా వరకు కంప్లీట్ చేసిన పవన్ త్వరలో క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ కెరీర్లో 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పవన్ బర్త్ డే నాడు డైరెక్టర్ క్రిష్ విడుదల చేయడం జరిగింది. అయితే ఈ సినిమాకి సంబంధించి టైటిల్ “విరూపాక్ష” అని మొదటిలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

 

ఈ టైటిల్ ని మొదటిలో మెగా బ్రదర్ నాగబాబు ద్వారా విని అదే అఫీషియల్ అని కన్ ఫర్మ్ అయ్యారు ఫ్యాన్స్. కానీ క్రిష్ బుర్రలో మాత్రం మరో టైటిల్ చక్కెర్లు కొడుతుంది అట. సాయి మాధవ్ రాసిన “అంతర్వాహిని” కవితలు అనే టైటిల్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన క్రిష్ అదే పవన్ మూవీకి టైటిల్ అని ఇండైరెక్ట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో ఇప్పుడు “అంతర్వాహిని” పేరు మెగా ఫ్యాన్స్ లో వైరల్ అవుతుంది.