ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: తులసి కి సారీ చెప్పిన నందు..! లాస్య చూస్తూనే ఉండిపోయిందా..!? అంత తప్పు ఏం చేశాడంటే..!?

Share

Intinti Gruhalakshmi: నందు, లాస్య తప్పతాగి ఇంటికి వస్తే తులసి ఇంట్లో వాళ్ళు ఎవరు చూడకుండా వాళ్ళిద్దరినీ రూమ్ లోకి తీసుకువెళుతుంది. నందు, లాస్య తాగి వచ్చినందుకు తులసి ఎలా రియాక్ట్ అవుతుంది.. వాళ్ళిద్దరికీ మళ్లీ తులసి క్లాస్ పీకుతుందా..!? లేదంటే సైలెంట్ గా ఉంటుందా..!? నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఇలా ఉన్నాయి..

Intinti Gruhalakshmi: 29 Jan 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 29 Jan 2022 Today Episode Highlights

నందు హ్యాంగోవర్ గా ఉందని లాస్య తో అంటాడు. మనం అనవసరం గా తాగమని లాస్య నందు మాట్లాడుకుంటుండగా తులసి వస్తుంది. పిల్లలకి ఆదర్శంగా ఉండాల్సిన మీరు తప్పతాగి ఇంటికి వస్తే వచ్చి పిల్లలకు ఏం నేర్పిద్దాం అని ప్రశ్నిస్తుంది. నువ్వు బావిలో కప్ప వి అని లాస్య అంటుంది. నీ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు. నీ ప్రపంచం కన్నా నా ప్రపంచం చాలా గొప్పది అని తులసి చెబుతుంది. పిల్లలు నా ప్రపంచంలో నాకు లాగా పెరగాలి అనుకుంటున్నాను అని తులసి అంటుంది. నీ ఏడుపు నువ్వు ఏడు మా మీద ఎందుకు ఏడుస్తున్నావు అని లాస్య అనడంతో. నందగోపాల్ గారు ఇప్పటికీ పిల్లలు మీ ఆదరణ లేక బాధపడుతున్నారు. మీ ప్రవర్తనతో వాళ్లని ఇంకా బాధ పెట్టకండి. తండ్రిగా మీ మర్యాద పోగొట్టుకోకు అండి అని తులసి అనగా.. ఏంటి నందు ఈ న్యూసెన్స్.. తన ముఖం కనపడకుండా ఇలా దూరంగా వచ్చి కూర్చున్నా.. వెతుక్కొని వచ్చి మరి ఇలా విసిగిస్తుంది. ఏదో ఒకసారి సరదాగా తాగితే ఇంత రాద్ధాంతం చేస్తున్నావ్ ఏంటి. దిస్ ఇస్ టూ మచ్ నువ్వేం మాట్లాడవేంటి నందు అని ప్రశ్నిస్తుంది లాస్య. సరదా అలవాటుగా మారుతుంది. అలవాటు వ్యసనంగా మారుతుంది. వ్యసనం జీవితాన్ని ఎదగకుండా చేస్తుంది. నా భయాన్ని అర్థం చేసుకోండి అంటూ నందుకి చెబుతుంది. తులసి నేను చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను. నిన్న నేను ఉన్న ఆనందం లో నన్ను నేను మరిచి పోయి ప్రవర్తించాను. దయచేసి తప్పుగా అనుకోకు ఇంకెప్పుడూ ఇలా జరగదు. నాది బాధ్యత. సారీ తులసి అని చెబుతాడు. నందు అంత పాజిటివ్ గా రియాక్ట్ అవడందో తులసి అక్కడి నుంచి కామ్ గా వెళ్ళిపోతుంది. ఇక లాస్య నందుని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతుంటే. తులసి మనకు సపోర్ట్ చేసింది. థింక్ పాజిటివ్ అని చెప్పేసి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

Read More: Devatha Serial: దేవిని తీసుకెళ్లాడని మాధవ్ ఆదిత్యను కొడతాడా..!? దేవుడమ్మా చూస్తూ ఊరుకుందా..!?

ఇక ఇంట్లో తులసి అంకితను వంటగదిలోకి రావొద్దని.. తను చదివిన చదువు కి న్యాయం చేయమని.. నువ్వు కూడా అభి లా జూనియర్ డాక్టర్ వి కావాలని.. ఆ దిశగా అడుగులు వేయాలని చెబుతుంది. అంకిత ఎంత నచ్చచెప్పే ప్రయత్నం చేసినా కూడా తులసి వినదు. ఇంకా అంకిత ఏం చేయాలేక ఒప్పుకుంటుంది. జూనియర్ డాక్టర్ గా రేపు ఇంటర్వ్యూ వెళ్తున్నట్లు శృతికి చెబుదామని వెళ్లగా.. అంతలో శృతి, ప్రేమ్ గొడవ పడుతూ ఉంటారు. వారి సంభాషణలను విని రూమ్ బయటే ఆగిపోతుంది. ప్రేమ్ వెళ్ళాకా ఆ తరువాత శృతితో అంకిత మీరు మాట్లాడుకున్న మాటలు అన్నీ విన్నానని ప్రేమ్ ని నేను ఒప్పించిన అని అడుగుతోంది. కాలమే ప్రేమ్ కి సమాధానం చెబుతుంది అని శృతి అంటుంది.

Intinti Gruhalakshmi: 29 Jan 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 29 Jan 2022 Today Episode Highlights

నిన్న అభి ఇంట్లో చేసిన రచ్చకి తులసి ఒక బలమైన నిర్ణయం తీసుకుంటుంది. పిల్లలందరినీ పిలిచి ఇంట్లో జీతం ఇస్తేనే వారి బాధ్యత తీసుకుంటానని లేకపోతే.. వారికి నచ్చినట్టుగా బ్రతకమని చెబుతుంది. ఇక తన జీవితం డబ్బులు ఇవ్వడానికి ప్రేమ్ ఒప్పుకుంటాడు. అభి ఎప్పటి లాగే రివర్స్ అవుతాడు. అంతలో లాస్య వచ్చి పిల్లలకు స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా అని అంటుంది ఈ ప్రశ్నలకు తన అత్తమామలు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారు లాస్య అన్న మాటలకు తులసి నందు కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. అభి ఈ సారి బయటకు వెళితే తన పొజిషన్ ఏంటో తనకే తెలియదు కాబట్టి. కక్కలేక మింగలేక ఎట్టకేలకి జీతం డబ్బులు ఇస్తానని ఒప్పుకుంటాడు. ఇక అభి బయటకు వెళ్లి డబ్బులు ఎలాగైనా సంపాదించాలని తన అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సహాయం కోరతాడు ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో నందు తులసి తో పిల్లలు నీ కడుపున పుట్టడం చాలా అదృష్టం అని తులసి ని పొగుడుతూ ఉండగా లాస్య వస్తుంది. ఏం మంత్రం వేసావో ఎప్పుడూ నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు అని లాస్య అంటుంది. వీరిద్దరి మధ్య రచ్చ కొనసాగుతుందా.. లేదంటే నందు నే లాస్య నోరు మూయిస్తాడా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.


Share

Related posts

Dull duel: మొండి బాకీలు త్వరగా వసూలు కావాలంటే ఇది మంచి మార్గం!!

siddhu

చంద్రబాబుకు మాజీల లేఖ

sarath

Keerthi suresh: ఊపందుకుంటున్న కీర్తి సురేష్ ..ఇక కష్టమే అనుకుంటున్న సమయంలో వరుస ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తోంది..

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar