Devatha Serial: ఫ్రెండ్స్ కి చాక్లెట్ ఇస్తామని దేవీ చిన్మయి బయటకి వెళతారు.. దేవి కోసం ఫ్రెండ్సే ఇంటికి బర్త్డే విషెస్ తెలియజేయడానికి గిఫ్ట్స్ తీసుకొని వస్తారు. ఇక ఇక వాళ్ళ తాత, నాన్నమ్మ, నాన్న వీళ్ళ దగ్గరికి రాలేదు అనగానే షాక్ అవుతారు. ఇక పిల్లలు వెళ్లిపోయిన తర్వాత మాధవ్ దేవి కి డ్రస్ కొనిచ్చి నువ్వేనా అని ప్రశ్నిస్తాడు. ఇదంతా ఆదిత్య చేశాడని తెలుసుకుని మాధవ్ కోపంగా ఆదిత్య దగ్గరకు వెళతాడు.. మరి నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
సత్య చెప్పిన హాస్పిటల్ కి వెళ్లిన రాధా అక్కడ ఒక నర్సు ను కలిసి తను ఆఫీసర్ భార్య సత్యనని చెప్పి తన పెనిమిటి తనకు పిల్లలు ఎందుకు రిపోర్ట్స్ లో వచ్చిన విషయం చెప్పడం లేదని.. ఆ రిపోర్టు వివరాలు తనని చెప్పమని కోరుతుంది. ఇక వచ్చింది ఆఫీసర్ భార్యనే కదా అని ఆ నర్సు రిపోర్ట్స్ అన్ని వెతికి సత్య పిల్లలు పుట్టరని, తన గర్భసంచి పాడైయిపోయిందని, ఇక జీవితంలో పిల్లలు పుట్టారని తెలుసుకుంటుంది..
ఆదిత్య మీద కోపంగా ఉన్న మాధవ్ పరుగుపరుగున ఆదిత్య గుడి లో ఉన్నాడని తెలుసుకొని వెళ్తాడు. దేవి ఆఫీసర్ సార్ కి పిల్లలు పుట్టాలని ఉంది. హుండీ లో వెండి ఉయ్యాల వేయబోతుండగా మాధవా వెళ్లి లాగి పడేసాడు. దాంతో ఆదిత్య ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ కి గురైతూ మాధవ్ ను చూస్తారు. ఇక మాధవ్ పుట్టినరోజు రోజున కూడా తన బిడ్డను తనకి దూరంగా చేశాడని. ఇంకోసారి తన పిల్లల్ని కలవడానికి వస్తే ఆదిత్య ను నేను ఏం చేస్తానో కూడా నాకు తెలియదు అని దేవుడమ్మ ముందు చెప్తాడు. ఈసారి తన పిల్లల్ని కలవడానికి వస్తే సమాధానం చేతితో చెబుతానని దేవుడమ్మ కు గట్టిగా చెబుతాడు. ఇక ఇంట్లో వాళ్ళందరూ కలిసి మాధవ ను తిడతారా లేదంటే సైలెంట్ గా ఈ గొడవ ముగుస్తుందో.. తెలియాలంటే తరువాయి భాగం వరకు వేచి చూడాల్సిందే.