Intinti Gruhalakshmi: నందూ తులసి చేసిన వంట తిన్నాడని లాస్యకు తెలుస్తుందా..!? శృతి తల్లి కాబోతుందా..!?

Share

Intinti Gruhalakshmi: నందు తన ఫ్రెండ్ ప్రకాష్ ఇచ్చిన‌ జాబ్ ఆఫర్ ఒప్పుకుంటాడు.. ఒక మంచి రోజు చూసుకొని జాబ్ లో జాయిన్ అవ్వు అని చెబుతాడు.. దాంతో నందు నాపై నమ్మకం ఉంచి ఇంత ఆఫర్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని ప్రకాష్ కి చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు..!! నేడు ప్రసారం కానున్న 527 వ ఎపిసోడ్ లో హైలెట్స్ ఇలా ఉన్నాయి..

Intinti Gruhalakshmi: Today Episode overview
Intinti Gruhalakshmi: Today Episode overview

శృతి వాంతులు చేసుకోవడం గమనించిన అనసూయమ్మ పరుగుపరుగున వెళ్లి తనకు జాగ్రత్త చెబుతుంది.. చూసావా చూసావా గట్టిగా అనుకుంటే ఏదైనా అయిపోతుంది అంటారు.. నేను ముని మనవడు కావాలి అనుకున్నాను లేదో.. పైనుంచి తథాస్తు దేవతలు తధాస్తు అని దీవించారు.. అని శృతి ని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి ఇవాల్టి నుంచి నువ్వు ఏ పనులు చేయవద్దు, బరువులు అస్సలు ఎత్తద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అని చెప్పేసి ఈ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి వస్తాను అని వెళుతుంది.. అంతలో అమ్ముమ్మ అమ్ముమ్మా అని శృతి గట్టిగా పిలుస్తూ లేచి వస్తుంది.. నువ్వు ఎందుకు లేచి వస్తున్నావు నువ్వు అసలు ఎప్పుడూ వొట్టి మనిషివి కూడా కాదు అని అంటుంది.. వొట్టి మనిషినే ఎటువంటి విశేషం లేదు.. అని అనసూయమ్మ ఆశలు నీరు గారుస్తుంది. నిజంగా నెల తప్పలేదా..!? లేదంటే తప్పే ఉద్దేశం లేదా అని శృతి అని ప్రశ్నించగా ఏ ఆడపిల్లయినా తల్లి కావాలనే ఆశ పడుతుంది అమ్మమ్మ గారు.. ఆ మాట అన్నావు సంతోషం తల్లి మాట విని అబార్షన్ చేయించుకుంది.. ఇప్పటి వరకు తల్లి లేదు పొరపాటున కూడా నువ్వు అలాంటి పిచ్చి పనులు చేయకు.. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితే బాగుంటుంది.. గుర్తుపెట్టుకో అనేసి అక్కడినుంచి వెళ్ళిపోతుంది అనసూయమ్మ..

Intinti Gruhalakshmi: Today Episode overview
Intinti Gruhalakshmi: Today Episode overview

ఇంట్లో అనసూయమ్మ వసంత గిల్లుఖాజ్జలు అనుకుంటుండగా.. నందు నాన్న అంటూ సంతోషంగా వస్తాడు.. అనసూయమ్మ మీ ఆవిడ మా నెత్తిమీద నెత్తి నిప్పుల కుంపటి పెట్టి ఆఫీస్లో హాయిగా కూర్చుని అమ్మ ముందు నేను చెప్పేది విను. వాళ్ళ నాన్న వచ్చి నందు వెళ్లిన పని ఏమైంది అని అడగగా నందు ఆనందంతో నాకు జాబ్ వచ్చింది అని చెబుతాడు.. నందుని తులసి, తులసిని నందు చూసే ఎక్స్ప్రెషన్స్ ఓ రేంజ్ లో పండిస్తారు ఇద్దరు.. ఈ చూపులను గమనించిన వసంత వీరిద్దరూ విడాకులు తీసుకున్నామంటారు. వీళ్ళ వాలకం చూస్తుంటేనేమో కొత్త తోరణాలు కట్టేలా ఉన్నారు అంటూ అనుమాన పడుతుంది.. నంది ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తాడు అక్కడే వాళ్ళ అమ్మానాన్న భోజనం చేస్తుండడంతో వసంత అని గట్టిగా వస్తున్నాను అంటూ తను చేసిన కూరలను వడ్డిస్తుంది అది తినడం ఇష్టం లేని నందు సైలెంట్ గా తినకుండా అలాగే ఉండిపోతాడు వసంత ఎలా ఎలా ఉంది టేస్ట్ సార్ అని అడగడంతో.. నందు అక్కడనుంచి లేచి వెళ్ళిపోబోగా.. నందు నందు అంటూ నందుని ఆపి.. ఈ అమ్మ ఉండగా నువ్వు ఎప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి కడుపు మాడ్చూకుని వెళ్లాల్సిన అవసరం లేదు.. అంటూ తీసుకొచ్చి కూర్చో పెట్టి నందు కి తులసి చేసిన వంటలు వడ్డించి అన్నం తినిపిస్తుంది. మొత్తానికి అమ్మ సెంటిమెంట్ లైవ్ లో బాగానే ఉన్నా ఈ విషయం లాస్య కు తెలిస్తే ఏం జరుగుతుందోనని తులసి లోలోపల మధనపడుతూ ఉంటుంది.

రేపటి ఎపిసోడ్ లో లాస్య జాబ్ కి వెళ్ళొచ్చా అలిసిపోయి తన అత్తగారి ఎదురుగానే కాళ్ళు చాపి రిలాక్స్ అవుతుంది.. వెంటనే అనసూయమ్మ తులసి మధ్యల జరిగే సంభాషణలు ఎలా ఉంటాయి.. నందు కేఫ్ లో మేనేజర్ గా చేయడానికి లాస్య ఒప్పుకుంటుందా.. నందు తులసి చేసిన వంట తిన్నాడని తెలుస్తుందా..!? తెలిస్తే గురించి లాస్య చేసే రచ్చ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి అంటే రేపటి వరకు ఆగక తప్పదు..


Share

Related posts

శర్వానంద్‌ రిస్క్‌

Siva Prasad

రాజస్థాన్ లో హస్తవాసి

Siva Prasad

రాజుగారిగ‌దిలోకి రేష్మీ..

Siva Prasad