Ghani vs Liger: గని వర్సెస్ లైగర్..మెగా హీరో సినిమాకు హైప్ లేకుండా పోయిందా..? ప్రస్తుతం ఇదే టాక్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఒకే జోనర్ కథలతో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన సందర్భాలున్నాయి. అలాగే, రెండు సినిమాలు మెప్పించలేని సందర్భాలూ ఉన్నాయి. ఇక ఒక సినిమా హిట్ సాధించి ఓ సినిమా ఫట్ అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తరహాలో అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్ సినిమాలు చేసి హిట్ కొట్టాలనుకున్నారు.
ఆ సినిమాలే అల్లు అర్జున్ నటించిన బధ్రీనాథ్, ఎన్.టి.ఆర్ నటించిన శక్తి. ఈ రెండు సినిమాల కథాంశం దాదాపుగా ఒకేలా ఉంటుంది. ఒక సినిమాకు వి.వి వినాయక్ దర్శకుడైతే ఒక సినిమాకు మెహర్ రమేశ్ దర్శకుడు. రెండు చిత్రాలు భారీ బడ్జెట్‌తో ఎంతో గ్రాండ్‌గా రూపొందించారు. కానీ, బాక్సాఫీస్ వద్ద బద్రీనాథ్, శక్తి రెండు బోల్తా కొట్టాయి. ఇక పూరి జగన్నాథ్ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో వచ్చిన టెంపర్, దర్శకుడు అనిల్ రావిపూడి మొదటిసారి దర్శకత్వం వహిస్తూ నందమూరి కళ్యాణ్ హీరోగా రూపొందించిన పటాస్ సినిమా కథల మేయిన్ పాయింట్ ఒకటే.
Ghani vs Liger: కొత్తగా అనిపించడం లేదనే కామెంట్స్..!
నిర్భయ ఇన్సిడెంట్. దీని ఆధారంగా ఒకేసారి..తెరకెక్కి కాస్త అటు ఇటుగా ఒకేసారి విడుదలయ్యాయి. అయితే.. రెండు సినిమాలలో హీరోల పాత్రలు స్క్రీన్ ప్లే కొత్తగా రాసుకోవడం వల్ల రెండూ భారీ కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. ఇక ఇప్పుడు బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ హీరోగా గని సినిమా వస్తోంది. అలాగే, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ వస్తోంది. లైగర్ నుంచి టీజర్ వచ్చి భారీ అంచనాలు నెలకొల్పింది. ఇక గని సినిమా నుంచి ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్, సాంగ్స్ కూడా వచ్చాయి. కానీ, ఇవేవి సినిమాపై అసక్తిని పెంచకపోగా..గతంలో శ్రీహరి నటించిన భద్రాచలం సహా మరికొన్ని సినిమాలను కంపేర్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. కొత్తగా అనిపించడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో ఈ సినిమాపై అంతగా హైప్ క్రియేట్ అవడం లేదు. చూడాలి మరి సినిమాలో ఆకట్టుకునే అంశాలు రిలీజయ్యాక తెలుస్తుందేమో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!