న్యూస్ సినిమా

Prabhas: ప్రభాస్ కోసం ఆ డైరెక్టర్ వెయిట్ చేయాల్సిందేనా..అనవసరంగా కమిటయ్యాడా..?

Share

Prabhas: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ తో సినిమా అంటే  పెద్ద కల నెరవేరినట్టే. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ రేంజ్ ఏ రేంజ్‌లో మారిపోయిందో అందరికీ తెలిసిందే. ఆ రేంజ్‌కు ప్రభాస్ పెద్ద సినిమాలు – పెద్ద డైరెక్టర్స్‌తో మాత్రమే కమిటవ్వాలి. కానీ, ఇక్కడ రివర్స్‌లో ప్రభాస్ కమిటవుతున్నాడు. సినిమాలు పెద్దవే కానీ, వాటిని తెరకెక్కించే దర్శకులే చిన్నవాళ్ళు. పాన్ ఇండియన్ సినిమాలను యంగ్ డైరెక్టర్స్ చేతిలో పెడుతూ ప్రభాస్ షాకిస్తున్నాడు. సాహో సినిమా డైరెక్టర్ సుజీత్‌కు రెండవది మాత్రమే. అందరూ దీని గురించి రక రకాలుగా మాట్లాడుకున్నారు.

is sandeep reddy vanga waiting for prabhas
is sandeep reddy vanga waiting for prabhas

కానీ, ప్రభాస్ యంగ్ డైరెక్టర్‌లో ఉన్న టాలెంట్‌ను నమ్మాడు. ఆ నమ్మకాన్ని చాలా వరకు సుజీత్ నిలబెట్టుకున్నాడు. కమర్షియల్ సక్సెస్ కాకపోయినా కూడా మేకింగ్ పరంగా మంచి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పుడు చేస్తున్న పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా సినిమా కూడా దర్శకుడు రాధాకృష్ణకు రెండవది మాత్రమే. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అసలు ప్రభాస్ ఎలా యంగ్ డైరెక్టర్ చేతిలో పెడుతున్నాడని ఇండస్ట్రీలో చాలా మంది చర్చించుకుంటున్నారు. దానికి ప్రభాస్ సన్నిహితుల నుంచి వస్తున్న సమాధానం ఒకటే. యంగ్ డైరెక్టర్‌కు ఓ తాపత్రయం ఉంటుంది.

Prabhas: అంత సమయం సందీప్ రెడ్డి వంగ ఆగుతాడా..!

ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరో అవకాశం అంటే అన్నీ వదిలేసి ఎంత శ్రమపడాలో అంతకు మించి కష్టపడుతుంటారు. అందుకే ప్రభాస్ యంగ్ డైరెక్టర్‌కు అవకాశాలిస్తూ వస్తున్నాడు. అయితే ప్రభాస్‌తో సినిమా అంటే ఎంత కాదన్నా 2 నుంచి 3 ఏళ్ళు సమయం కేటాయించాలి. లేదంటే కుదరదు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా అంతే. ప్రభాస్ కమిటయిన ప్రాజెక్ట్ కె మూవీ అయ్యే వరకు వెయిట్ చేయక తప్పదని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా మొదలవ్వాలంటే కనీసం ఇంకో ఏడాది గ్యారెంటీగా పడుతుందని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు. మరి అంత సమయం సందీప్ రెడ్డి వంగ ఆగుతాడా..లేక మరో సినిమాను కంప్లీట్ చేసుకు వస్తాడా చూడాలి. ఇక ప్రభాస్ – సందీప్ రెడ్డిల కాంబోలో వచ్చే సినిమా స్పిరిట్.


Share

Related posts

Viral Video: ఇంటి ముందు నిద్రిస్తున్న పెంపుడు కుక్కను నొటికి కరుచుకుని వెళ్లిన చిరుత..! వీడియో వైరల్..!!

somaraju sharma

Bigg Boss 5 Telugu: మూడవ వారం ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యుల వివరాలు..!!

sekhar

Balakrishna: ఎట్టకేలకు బాలయ్య బాబు ను ఒప్పించిన ఆ స్టార్ డైరెక్టర్..??

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar