Jagapathi Babu: తెలుగు సినిమా రంగంలో హీరోగా విలన్ పాత్రలో తనదైన శైలిలో మెప్పించిన హీరో జగపతిబాబు. ప్రారంభంలో కుటుంబ ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్న హీరోగా.. అనేక సినిమాలు చేసిన జగపతి బాబు ఆ తర్వాత మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. మావి చిగురు, శుభలగ్నం, పెద్దరికం, గాయం, శుభాకాంక్షలు, పెళ్లి పందిరి, దొంగాట వంటి సినిమాలతో అప్పట్లో అలరించిన జగపతిబాబు సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ పాత్రలలో ఆదరగొట్టేస్తున్నాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఒక విలన్ పాత్ర మాత్రమే కాదు హీరోకి తండ్రిగా కూడా జగపతిబాబు ఇటీవల చేసిన సినిమాలు ఆయనకు ఎంతగానో పేరు తెచ్చిపెట్టాయి. శ్రీమంతుడులో మహేష్ బాబు తండ్రిగా జగపతిబాబు క్యారెక్టర్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత లెజెండ్, అరవింద సమేత వీర రాఘవ, నాన్నకు ప్రేమతో, రంగస్థలం ఇంకా చాలా సినిమాలలో జగపతి బాబు విలన్ పాత్రలో మెప్పించి రాణిస్తున్న సంగతి తెలిసిందే. అనేక వైవిధ్యమైన పాత్ర లతో రాణిస్తున్న జగపతి బాబు తాజాగా ఫారెస్ట్ మ్యాన్ గా కొత్త సినిమాలో నటిస్తున్నారు.
సినిమా టైటిల్ “సింబా – ది – ఫారెస్ట్ మాన్” దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ మేకర్స్ ఇటీవల విడుదల చేయడం జరిగింది. జగపతిబాబు భుజాలమీద చెట్లను మోసుకుంటూ పోస్టర్ లో వెళ్తున్నారు. తల్లి లాంటి ప్రకృతి తనయుడు.. ఇతడు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హీరో జగపతి బాబును సింబాగా పరిచయం చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటిస్తామని సినిమా యూనిట్ స్పష్టం చేయడం జరిగింది. జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాకి సంపత్ నంది స్టోరీ అందించడం జరిగింది. ముసలి గడ్డంలో చాలా కొత్తగా జగపతిబాబు కనిపిస్తున్నాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!