పుట్టిన రోజు సందర్భంగా కొందరు సామాజిక కార్యక్రమాలను చేసేస్తుంటారు. అలాగే పుట్టిన రోజు వేడుకలను చాలా మంది అమ్మాయిలు పద్దతిగా ఉండే చీరలో లేక లంగావోణీలో దరించి పుత్తడిబొమ్మలాగా తయారవుతుంటారు. ఇలా సామాన్యులు తయారవుతారనుకుంటే హీరోయిన్స్ మాత్రం ఇంకొంచెం హాట్ గానే తయారవుతారనుకోండి. అంటే గార్జియస్ లుక్స్ కోసం ఇంకొంచెం అందంగా చీరనో లేక మోడ్రన్ డ్రెస్ నో ధరిస్తుంటారు. కాని ఓ యువ నాయిక మాత్రం బర్త్ డేకు ధరించిన డ్రెస్ ను చూసి కుర్రకారుకు కిక్కెస్తుందని చెప్పుకోవచ్చు.
మరీ ముఖ్యంగా బర్త్ డేకు కూడా ఇలాంటివి ధరిస్తారని ఈమెనే కొత్తగా క్రియేట్ చేసిందనుకుంటున్నారు నెటిజన్లు. ఇంతకు ఆ డ్రెస్ ఏంటని అనుకుంటున్నారు. అదేనండి ఈ బర్త్ డే వేడుకలకు బికినీ వేసి అందరినీ స్టన్ అయ్యేలా చేసిందంటే నమ్మండి.. మరి ఆ యువ నటి ఎవరో తెలుసా.. ‘జవానీ జానేమన్’ అనే సినిమాతో సినీ పరిశ్రమకు సైఫ్ అలీ ఖాన్ కూతురిగా పరిచయమైన భామ అలయా ఎఫ్.
ఈ సుందరి శనివారం తన 23 వ బర్త్ డే వేడకలను చేసుకుంది. కాని ఈ బ్యూటీ వేసుకున్న డ్రెస్సును చూసి నోరెళ్లబెడుతున్నారండి బాబు. బికినీ ధరించి ముంబైలోని సముద్ర తీర పట్టణంలోని అలీబాగ్ లో తన ఫ్రెండ్స్ లో శుక్రవారం ఇలా డిఫరెంట్ గా బర్త్ డేను చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే అలియాకు తన పుట్టిన రోజున బర్త్ డే విశెస్ తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది.
అలాగే తన పుట్టిన రోజు వేడుకలను సంబంధించిన ఆమె ఫోటోను కూడా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలి అలాయి బికినీలో హాట్ ఫోజ్ తో అదరగొట్టింది. అలాగే అందంగా డెకరేట్ చేయబడిన A F అనే అక్షరాల మధ్య స్టైల్ గా నిలబడి హాట్ ఫోజ్ ఇచ్చింది ఈ భామ. కాని ఏమాటకామేటే చెప్పుకోవాలండి… ఎందుకంటే ఇప్పటి వరకు బర్త్ డే రోజున ఎవరూ బికినీ డ్రెస్ ను వేసుకోలేదనుకుంటా.. దీంతో మిగతావారు కూడా ఇలా సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశాన్ని కల్పించేసిందిగా..
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!