సినిమాల్లో ఐటెమ్ సాంగ్‌లు కాస్త స్సెషల్ సాంగ్స్‌గా మారిపోయాయి. స్టార్ హీరోయిన్స్ అందరూ స్పెషల్ సాంగ్స్‌లో నటిండచానికి వెనకాడటం లేదు. ఏమాత్రం వీలున్నా.. స్పెషల్ పాటల్లో చిందేస్తున్నారు. ఇలా స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్‌లో నటించడం వల్ల భారీ మొత్తాలే రెమ్యునరేషన్స్గా లభిస్తాయి. ఇప్పుడు కాజల్ అగర్వాల్ స్పెషల్ సాంగ్‌లో నటించనుంది. బన్ని, త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ చేస్తుందని వార్తలు వినపడుతున్నాయి. కాజల్ స్పెషల్ సాంగ్‌లో నటించడం ఇదేమీ కొత్త కాదు. గతంలో `జనతాగ్యారేజ్`లో కూడా ఎన్టీఆర్ సరసన ఓ స్పెషల్ సాంగ్‌లో నటించింది. మరి బన్నితో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!