Kamal Rajani: తమిళ సినిమా రంగంలో దిగ్గజ నటులు కమల్ హాసన్, రజినీకాంత్. ఇద్దరికిద్దరూ టాప్ మోస్ట్ నటులు. ఒకరికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే మరొకరికి నటన కోణంలో విభిన్నమైన షేడ్స్ తెరపై పండించే తిరుగులేని సత్తా ఉంది. ఇదిలా ఉంటే కమల్ హాసన్ గత కొన్ని సంవత్సరాలుగా.. తమిళ రాజకీయాలలో బిజీగా ఉండటం తెలిసిందే. అయితే గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఓడిపోవటంతో చాలా వరకు సైలెంట్ అయిపోయి ఇప్పుడు యధావిధిగా సినిమాలు చేసుకుంటూ ఉన్నారు.
కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అప్పట్లో పోటీ చేయాలని రజిని కూడా ప్రయత్నాలు చేసి చివరిలో తన ఆలోచన మార్చుకుని మళ్లీ ప్రస్తుతం సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో చాలా కాలం తర్వాత రజనీకాంత్..తో కమల్ హాసన్ ఇటీవల భేటీ అయ్యారు. ఈ క్రమంలో డైరెక్టర్ లోకేష్ కనకరాజు కూడా ఆ సమయంలో ఉండటం జరిగింది. ప్రస్తుతం కమలహాసన్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో “విక్రమ్” అనే సినిమా చేయడం తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటువంటి తరుణంలో “విక్రమ్” సినిమా గురించి ఈ భేటీలో రజినీకాంత్ .. డైరెక్టర్ లోకేష్ కనకరాజుని అడిగి తెలుసుకోవటం జరిగిందట.
ఈ విషయాన్ని లోకేష్ కనకరాజు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఇక ఇదే సమయంలో కొద్దిసేపు రజిని మరియు కమల్ మాట్లాడుకోవడం జరిగిందట. చాలా కాలం తర్వాత స్వయంగా కమలహాసన్… రజినీకాంత్ ఇంటికి వెళ్లి.. ముచ్చటించడంతో ఈ భేటీ తమిళ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఈ భేటీకి గల కారణం “విక్రమ్” ప్రీమియర్ కి రజినీకాంత్ ని సినిమా యూనిట్ ఆహ్వానించినట్లు సమాచారం. అంతమాత్రమే కాదు “విక్రమ్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా చీఫ్ గెస్ట్ గా.. రజనీకాంత్ ని స్వయంగా కమల్ ఆహ్వానించినట్లు.. కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా చాల కాలం తర్వాత రజని కమల్ భేటీ కోలీవుడ్ లో అనేక చర్చలకు దారితీస్తోంది.
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…
Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…
YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…