న్యూస్ సినిమా

Acharya – Mahesh: మెగా మల్టీస్టారర్‌లో సూపర్ స్టార్ కూడా..ఏం చేస్తున్నారంటే..

Share

Acharya – Mahesh: ఆచార్య…ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మెగా అభిమానులతో పాటు..సినీ లవర్స్ అందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మెగా మల్టీస్టారర్. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మెగా మల్టీస్టారర్‌లో మెగాస్టార్ చిరంజీవి-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. కాజల్ అగర్వాల్..పూజా హెగ్డే హీరోయిన్స్‌గా నటించారు. సంగీత, రెజీనా స్పెషల్ సాంగ్స్‌లో సోనూసూద్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన నాలుగు పాటలు టీజర్ భారీ అంచనాలు పెంచాయి.

mahesh babu voice over for acharya
mahesh babu voice over for acharya

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో రెండు రోజుల్లో హైదరాబాద్ యూసఫ్ గూడా గ్రౌండ్స్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్‌కు దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా రాబోతున్నారు. అలాగే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వచ్చే అవకాశాలు న్నాయని అంటున్నారు. అదే జరిగితే ఆచార్య గ్రాండ్ ఈవెంట్ అదిరిపోవడం ఖాయం. కాగా, ఇప్పుడు ఈ సినిమాకు సూపర్ స్టార్ మహేశ్ బాబు అడిషనల్ అట్రాక్షన్ కానున్నారట.

Acharya – Mahesh: త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్..

గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన జల్సా సినిమాకు సూపర్ స్టార్ వాయిస్ ఓవర్ అందించారు. కథను ముందుకు నడపడంలో మహేశ్ వాయిస్ సాలీడ్‌గా ఉపయోగపడింది. అయితే, ఇప్పుడు మెగా మల్టీస్టారర్ ఆచార్యకు మహేశ్ వాయిస్ అందివ్వబోతున్నారట. తన వాయిస్‌తో చిరు పాత్ర తీరుతెన్నులు ఉంటాయని ఆయన పాత్రను నడిపించేదిగా మహేశ్ ఇచ్చే వాయిస్ ఉంటుందని సమాచారం. త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుంది. సైరాకు పవన్ ఇచ్చిన వాయిస్ ఎంత హైప్ తీసుకువచ్చిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో భలే బంజారా సాంగ్‌లో చిరు – చరణ్‌లను చూసేందుకు రెండు కళ్ళు చాలవంటున్నారు.


Share

Related posts

చైనా వేషాలు ఈ శాటిలైట్ అడ్డంగా బయటపెట్టింది!

CMR

ఐపీఎల్ 2020 : నేడే ఫైనల్ – ఫేవరెట్ గా ముంబై… తొలి టైటిల్ పై కన్నేసిన దిల్లీ

arun kanna

Kiara Advani: చూపించాల్సిన యాంగిల్స్ అన్నీ చూపించేసిన‌ కియారా.. పిక్స్ వైర‌ల్‌!

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar