SSMB 28: సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే 3 సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు. “సర్కారు వారి పాట” సినిమా విజయంతో మంచి జోష్ మీద ఉన్న మహేష్ ప్రస్తుతం ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ లో ఉన్నారు. త్వరలో హైదరాబాద్ చేరుకొని నెక్స్ట్ త్రివిక్రమ్ తో “SSMB 28” షూటింగ్ లో జాయిన్ కానున్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా రెండు సినిమాలు రావడం తెలిసిందే. రెండూ కూడా ప్రేక్షకులను ఎంతగానే ఎంటర్టైన్ చేయడం జరిగింది.
దీంతో వస్తున్న మూడో సినిమా పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబుతో చేయబోయే ఈ ప్రాజెక్ట్ లో సీనియర్ యాక్టర్ మోహన్ బాబుని.. అదేవిధంగా శోభననీ తీసుకోవడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో నడుస్తుంది. గతంలో త్రివిక్రమ్ తన సినిమాలలో సీనియర్ హీరోయిన్ లను తీసుకోవడం తెలిసిందే. టబు, స్నేహ, నదియా వంటి వారిని తీసుకున్నారు. అయితే మహేష్ బాబు సినిమా కోసం శోభననీ తీసుకోవడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి పార్ధు, లేదా అర్జునుడు అనే టైటిల్స్ పెట్టే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నట్టు సమాచారం. ఈ సినిమా దాదాపు ఆరు నెలలలో కంప్లీట్ చేసి వచ్చే ఏడాది ఉగాది పండుగ నాడు విడుదల చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్. అంత మాత్రమే కాదు ఈ సినిమాలో మహేష్ డబల్ ఫోజ్ లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో “SSMB 28” పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు ఇండస్ట్రీ టాక్.
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…
Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు ఇటీవల `సర్కారు వారి పాట`తో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, అందాల భామ రాశి ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పక్కా…