నందమూరి బాలకృష్ణ నిన్ను చంపేయ్ మన్నాడు హైపర్ ఆది కి అర్ధరాత్రి ఫోన్ వచ్చింది..!! 

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను అలరించే షో లలో ముందుండేది జబర్దస్త్ కామెడీ షో. టిఆర్పి రేటింగ్ లలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉండే ఈ షోకి మంచి ప్రేక్షకాదరణ ఉంది. జబర్దస్త్ లో వేసే స్కిట్లు పంచులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే విధంగా ఉండటంతో… యూట్యూబ్ ఛానల్ లో కూడా మంచి ఆదరణ దక్కించుకుంటూ ఉంది. ముఖ్యంగా హైపర్ ఆది స్కిట్ లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే రీతిలో ప్రాస ఉంటాయి. బుల్లితెరపై కామెడీ షో తో ఎంట్రీ ఇచ్చిన హైపర్ ఆది తన పంచ్ డైలాగులతో చాలావరకు పాపులర్ అవ్వడం తో ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలలో రాణిస్తున్నారు.

hyper Aadi: Balakrishna: మళ్లీ బాలయ్యను కెలికిన హైపర్ ఆది.. ఎలా మాట్లాడాలో నేర్చుకో లక్డీకపూల్ అంటూ!! - hyper aadi imitates balakrishna in jabardasth latest promo | Samayam Teluguఇదిలా ఉండగా ఇటీవల ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు హైపర్ ఆది. ఈ సందర్భంగా జబర్దస్త్ ప్రారంభంలో తనకు ఎదురైన ఓ సంఘటన గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు. జబర్దస్త్ ప్రారంభంలో అదిరే అభి టీంలో స్కిట్స్ వేసిన్నట్లు, ఆ సమయంలో నందమూరి తారకరామారావు పాత్ర ని ఇమిటేట్ చేస్తూ స్కిట్ చేసినట్లు ఇంటర్వ్యూలో చెప్పిన హైపర్ ఆది…., ఆ రోజు అర్ధరాత్రి నందమూరి బాలకృష్ణ పర్సనల్ అసిస్టెంట్ అని చెబుతూ ఆ స్కిట్టు చేసినందుకు బాలకృష్ణ మిమ్మల్ని చంపేయ్ మాని అన్నారు అని ఫోన్ చేయడంతో ఒక్కసారిగా కంగారు పడిపోయాను అదంతా ఫేక్ కాల్ అని తెలిసిన తర్వాత ఊపిరిపీల్చుకున్న అంటూ హైపర్ ఆది తెలిపారు.

ఇదే విషయాన్ని మిగతా కుటుంబ సభ్యులతో చెప్పటంతో ఇలాంటివి ఈ మధ్య కాలంలో కొంతమంది కావాలని చేస్తున్నారని భయపడాల్సిన అవసరమేమీ లేదని ధైర్యం చెప్పారట. ఆ తర్వాత హైపర్ ఆది మాట్లాడితూ… ఏదో సరదాగా నవ్వించడం కోసం ఇలా చేస్తారు తప్ప ఎవరినీ ఉద్దేశించి నొప్పించడానికి చేయము అంటూ హైపర్ ఆది తెలిపారు. ప్రస్తుతం జబర్దస్త్ షో లో కమెడియన్ గా నటిస్తూనే సౌత్ ఇండియాలో నెంబర్ వన్ డాన్స్ షో “డీ” లో టీం లీడర్ గా రానిస్తున్నట్లు..  అదే విధంగా అనేక టాలీవుడ్ చిత్రాలలో కమెడియన్ పాత్ర చేస్తున్నట్లు స్పష్టం చేశారు.