తెలుగులో అందాల రాక్షసిలో ఐలవ్ యూ అంటూ హీరోయిన్ వెంటపడ్డ గడ్డం సూర్యగా నవీన్ చంద్ర అమ్మాయిలకు చాలా కాలం గుర్తుండిపోయాడు. అయితే సరైన సినిమాలు ఎంచుకోకపోవడమే.. లేక ఎంచుకున్న సినిమాలు సక్సెస్ కాకపోవడమో ఏదైనా కావచ్చు. హీరోగా మరో మంచి హిట్ సొంతం చేసుకోలేకపోయాడీ హీరో. అయితే కేవలం హీరోగానే సినిమాలు చేస్తానని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడానికి అంగీకరించడంతో నవీన్ చంద్రకు మంచి టర్న్ దక్కినట్లయ్యింది. నేను లోకల్, అరవిందసమేత చిత్రాల్లో నెగటివ్ షేడ్స్‌లో నటించారు. ఇప్పుడు తెలుగులోనే కాదు.. ఏకంగా తమిళంలో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడట. అది కూడా ధనుష్ చిత్రంలో. కొడి దర్శకుడు దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో నవీన్ చంద్ర చాలా పెద్ద పాత్రనే చేస్తున్నాడట. తెలుగులో మరో పక్క రెండు సినిమాల్లో హీరోగా కూడా నటిస్తున్నాడు నవీన్ చంద్ర. మరి తమిళంలో నటిస్తున్న నవీన్ చంద్రకు ఎలాంటి బ్రేక్ తెస్తుందో చూడాలి.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!