ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత పీవీపీ మేనేజర్ భాను ప్రకాశ్ అదృశ్యమయ్యాడు. పీవీపీకి సంబంధించిన కంపెనీల్లో ఆర్థిక అవకతవకలకు భాను ప్రకాశ్ కారణంగా భావిస్తున్నారు. ఆ కారణంగానే కొందరు భాను ప్రకాశ్‌ను బలవంతంగా విజయవాడకు తీసుకెళ్లారట. అయితే అదేరోజున ఆఫీస్ కెళ్లిన తన భర్త ఇంటికి రాలేదంటూ భాను ప్రకాశ్ భార్య ఉషారాణి కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు పరిశీలనలో భాగంగా పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో భాను ప్రకాశ్‌ను కంపెనీ మనుషులు విజయవాడలోనే విడిచిపెట్టేసినట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!