Radhe shyam: ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరూ మాట్లాడుకుంటుంది పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా గురించే. భీమ్లా నాయక్ లాంటి కంప్లీట్ మాస్ ఎంటర్‌టైనర్ తర్వాత వచ్చిన కంప్లీట్ క్లాస్ మూవీ ఇది. పీరియాడికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించారు. యూఎస్‌తో పాటు ఇతర దేశాలలో రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ అయ్యాయి. ఇండియాలోనూ అన్నీ చోట్ల రిలీజ్‌కు ముందు భారీ హైప్ నెలకొని విడుదలైంది రాధే శ్యామ్. ప్రభాస్ కెరీర్‌లో మొదటి సారి ఇలాంటి సినిమాను చేయడం విశేషం.

తన ఇమేజ్‌ను పక్కన పెట్టి ఎంతో నమ్మకంగా రాధే శ్యామ్ చిత్రాన్ని ఇటలీ, యూరప్ నేపథ్యంలో చేశాడు. పూజా హెగ్డే ఈ మూవీలో ప్రభాస్ సరసన నటించింది. వసూళ్ళపరంగా కొన్ని చోట్ల పరవాలేదనిపించినా చాలాచోట్ల మాత్రం నిరాశ తప్పలేదు. ప్రభాస్ నుంచి ఆశించిన అంశాలు లేకపోవడం వల్లే అభిమానులు సైతం రాధే శ్యామ్ సినిమాను ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేర్చారు. కానీ, మేకర్స్ మాత్రం ఇది అద్భుతమైన దృశ్య కావ్యమని ఇలాంటి సినిమాను అందరూ హీరోలు చేసే సాహసం చేయరని చెప్పుకుంటున్నారు.
Radhe shyam: ఆ విషయం మరోసారి ప్రేక్షకులకు తెలియజేసేందుకే..
అంతేకాదు..ఇలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీలో మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ కోరుకోవడం కరెక్ట్ కాదని కన్విన్స్ చేసే ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇంకా జనాలలో ఆసక్తి పెంచేందుకే ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాధే శ్యామ్ మూవీ నుంచి తాజాగా థీమ్ మ్యూజిక్ వీడియోను విడుదల చేశారు. ఎంతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. సినిమా ఫ్లో ఎలా ఉన్నా కూడా థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, జస్టిన్ భరద్వాజ్ అందించిన సాంగ్స్ సినిమాకు చాలా వరకు ప్లస్ అయ్యాయి. ఆ విషయం మరోసారి ప్రేక్షకులకు తెలియజేసేం దుకే ఈ థీమ్ మ్యూజిక్ వీడియోను వదిలారు. మరి ఇంత ఆశపడుతున్న మేకర్స్‌కు పెట్టిన పెట్టుబడి వస్తుందో లేదో చూడాలి.