Kangana Ranaut: ఇప్పుడు ఎక్కడ విన్నా ఒకే ఒక సినిమా పేరు వినబడుతోంది. అదే ‘ది కాశ్మీర్ ఫైల్స్’. అవును.. ఈ సినిమా దర్శకుడు అయినటువంటి ‘వివేక్ అగ్రి హోత్రి’ పైన సినీ, రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. మార్చి 11న దేశవ్యాప్తంగా విడుదలైన ఈమూవీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాకుండా కలెక్షన్ల పరంగా కూడా కుమ్మేస్తోంది. స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూసి చిత్ర యూనిట్‌ని ప్రత్యేకంగా అభినందించారు. దీంతో ఈ మూవీకి మరింత పాపులరిటీ వచ్చినట్టైంది. ఈ క్రమంలో బాలీవుడ్ ఫ్రైర్ బ్రాండ్ అయినటువంటి కంగనా రనౌత్ కూడా తన రివ్యూ చెప్పింది.
Kangana Ranawat: కంగనాకి తన వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలియదా? మరి ఆ మాటలు ఏమిటి?
Kangana Ranaut: కంగనా పూర్తి మాటలు ఇవే:
కంగనా హోస్ట్ వస్తున్న కాంట్రవర్సల్ రియాలిటీ షో ‘లాక్అప్’ గురించి విదితమే. అయితే నిన్నటి ఎపిసోడ్లో కంగనా ఈ మూవీ గురించి ప్రస్తావిస్తూ… ‘‘ఈ మూవీ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రితో పాటు నిర్మాతలకు, మూవీ టీంకు నా అభినందనలు. వీరు సినిమా పరిశ్రమ పాపాలను కడిగిపారేశారు. ఈ క్రమంలో బాలీవుడ్ చేసిన పాపాలను ప్రక్షాళన చేశారు. కశ్మీర్ ఫైల్స్‌ను గొప్పగా చూపించారు. పరిశ్రమలో ఎలుకల్లా దాగిన వారు బయటకు వచ్చి ఈ సినిమాను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుంది.” అన్నారు.
Kangana Ranaut: బిగ్ బాస్ లాంటి హిందీ షోలో హోస్ట్ గా కంగనా రనౌత్..!!
ఇంకా ఏమన్నారంటే?
“పనికిరాని సినిమాలను ప్రోత్సహించే వారందరూ ఈ సినిమాకు మద్దతుగా నిలబడండి. తద్వారానైనా మీ పాపాలు తొలగిపోతాయి.” అని కంగనా కొంచెం ఘాటుగా స్పందించింది. కాగా గతవారం కూడా కంగనా ఈ సినిమా గురించి మాట్లాడారు. ఈ ఏడాది వచ్చిన వాటిల్లో ఎంతో విజయవంతమైన, లాభదాయకమైన చిత్రంగా ఆమె దీన్ని పేర్కొంటూ, కేస్ స్టడీగా తీసుకోవాలని పేర్కొన్న సంగతి అందరికీ తెలిసిందే.