Radhe shyam: యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందిన మోస్ట్ అవైటెడ్ సినిమా ‘రాధే శ్యామ్’. పూజాహెగ్డే ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటించింది. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సినవసరం లేదు. ఇప్పటికే ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ వీడియోస్, సాంగ్స్, పోస్టర్స్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి.

ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ రామోజీ ఫిల్ సిటీలో భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌లోనే ‘రాధే శ్యామ్’ ట్రైలర్ ను అన్నీ భాషలలో అభిమానులతో విడుదల చేయించారు. ఇప్పటి వరకు కేవలం వీఎఫెక్ట్స్‌లో ఎక్కువగా కంటెంట్ వదిలిన మేకర్స్ మొదటిసారి ట్రైలర్‌తో కథా నేపథ్యాన్ని ..ప్రభాస్ – పూజా హెగ్డేల మధ్య జరిగే లవ్ జర్నీని తెలిపే ప్రయత్నం చేశారు.
Radhe shyam: రెండు మూడు సార్లు చూస్తేగానీ మెయిన్ థీమ్ ఎంటో అర్థం కావడం లేదట.
ఈ తాజా ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హీరోగా ప్రభాస్ కెరీర్‌లోనే ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రను ‘రాధే శ్యామ్’లో చేశారు. ప్రఖ్యాత హస్త సాముద్రిక నిపుణిడిగా కనిపించబోతున్నారని..ట్రైలర్‌లో బాగా ఎస్టాబ్లిష్ చేశారు. టెక్నికల్‌గా ఈ సినిమా ఓ విజువల్ వండర్‌లా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దాదాపు మూడేళ్ళ కష్టం ట్రైలర్‌లోనే తెలిసిపోతోంది. అమర ప్రేమికుల కథ..దాన్ని కొత్త కోణంలో చూపించబోతున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. అసలు మాస్ ఎలిమెంట్స్‌కు చోటే లేదని క్లియర్‌గా
అర్థమవుతోంది. ట్రైలర్ చూసిన అందరూ బావుందంటున్నారు. కానీ, రెండు మూడు సార్లు చూస్తేగానీ మెయిన్ థీమ్ ఎంటో అర్థం కావడం లేదట. మరి సినిమా ఏ మేరకు జనాలకు రీచ్ అవుతుందో చూడాలి. వచ్చే నెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘రాధే శ్యామ్’.