RRR: “రాధేశ్యామ్” ఇటీవల రిలీజ్ అయ్యి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేక పోయిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ సినిమా… విడుదలైన ప్రతి చోటా అట్టర్ ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో ప్రస్తుతం సినీ ప్రేమికుల దృష్టి మొత్తం “RRR” పై పడింది. “బాహుబలి” వంటి భారీ బ్లాక్ బస్టర్ తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో “RRR” తెరకెక్కడంతో… మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఈ సినిమా చూడటానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో మార్చి 25 వ తారీకు “RRR” విడుదల కానున్న తరుణంలో .. సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి. గతంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రీ రిలీజ్ వేడుక.. అంగరంగ వైభవంగా జరిపారు. సౌత్ కి వచ్చేసరికి మలయాళం అదేవిధంగా తమిళ్ లో ఘనంగా నిర్వహించారు. అయితే అసలైన భాష తెలుగుకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక మరింత గ్రాండ్ గా చేయాలని… ఈ ఫంక్షన్‌కి మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలకృష్ణ నీ ముఖ్య అతిథులుగా తీసుకురావడానికి… సినిమా యూనిట్ ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదల విషయంలో.. సరికొత్త వార్త ఇప్పుడు ఇండస్ట్రీ లో వైరల్ అవుతుంది. మేటర్ లోకి వెళ్తే సౌదీ అరేబియాలో ఈ సినిమా విడుదల చేయడానికి… “RRR” మేకర్స్ డిసైడయ్యారు. మార్చి 25 వ తారీకు ఇండియాలో అలాగైతే విడుదలవుతున్న అదే తేదీన… సౌదీ అరేబియా లో ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆ దేశంలో .. చరణ్ మరియు తారక్ ఫాన్స్ చాలామంది ఉండటంతో పాటు ఎప్పటినుండో సోషల్ మీడియాలో..”RRR” యూనిట్ ని కోరుతున్న తరుణంలో.. మేకర్స్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో సౌదీ అరేబియా లో ఉన్న నందమూరి మెగా అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!