సినిమా

SVP: సక్సెస్ సంబరాల్లో మునిగితేలుతున్న సర్కారువారిపాట టీమ్.. థమన్ మిస్సింగ్!

Share

SVP: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టించిన చిత్రం స‌ర్కారు వారి పాట‌ ఈ గురువారం విడుద‌లైన సంగతి అందరికీ తెలిసిందే. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ తొలి రోజు తొలి షో నుంచే మిశ్రమ స్పందనను మూటకట్టుకుంది. ఈ క్రమంలో ముఖ్యంగా దీనికి సంగీతం ఇచ్చినటువంటి థమన్ ని కొంతమంది ఆడిపోసుకుంటున్నారు. దాదాపు రెండేళ్లుగా మహేష్ సినిమా కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్ ఈ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేద‌ని, కొంత వ‌ర‌కు వారిని నిరుత్సాహానికి గురిచేసింద‌ని తెలుస్తోంది. గురు, శుక్ర‌, శని, ఆదివారాలు వీకెండ్స్ కావ‌డంతో క‌లెక్ష‌న్స్ కొంత వ‌ర‌కు ఫ‌ర‌వాలేద‌నిపంచే స్థాయిలో ఉన్నప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం దుమ్ము దులుపోతోంది.

సక్సెస్ సంబరాలు ఏమిటి?

ఇకపోతే, సినిమాకు మిశ్ర‌మ స్పంద‌న ల‌భించినా తొలి రోజు వ‌ర‌ల్డ్ వైడ్ గా ఈ మూవీ 75 కోట్లు వ‌సూలు చేయడం కొసమెరుపు. దాంతో రిజ‌న‌ల్ మూవీస్ లో ఇదే పెద్ద రికార్డుగా మేక‌ర్స్ ప్ర‌చారం చేస్తున్నారు. అయితే మండే రోజు ఈ సినిమా పూర్తి ఫిలితం బ‌య‌ట‌ప‌డ‌బోతోంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా ఫలితం విష‌యంలో పెద్ద‌గా సంతృప్తిని వ్య‌క్తం చేయ‌డం లేదు. కానీ కలెక్షన్లను దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం స‌క్సెస్ సంబ‌రాల‌ని మొద‌లు పెట్టేసింది. ప్ర‌త్యేకంగా శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ లోని పోష్ ప‌బ్ లో టీమ్ మెంబ‌ర్స్ తో పాటు గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.

థమన్ మార్క్ మిస్సింగ్?

ఇక ఈ సినిమా ఫెయిల్యూర్ లో థమన్ మార్క్ మాత్రమే మిస్ అవ్వలేదు. తాజాగా జరిగిన పార్టీలో కూడా థమన్ మిస్ అయ్యారని టాలీవుడ్ కోడై కూస్తోంది. అవును… హీరో మ‌హేష్ బాబు, న‌మ్ర‌త‌, డైరెక్ట‌ర్ ప‌ర‌శురామ్, డైరెక్ట‌ర్లు హ‌రీష్ శంక‌ర్‌, సుకుమార్‌, బుచ్చిబాబు సానా, మెహెర్ రమేష్‌, శిరీష్‌, దిల్ రాజు త‌దిత‌రులు పాల్గొన్న ఈ సక్సెస్ పార్టీలో త‌మ‌న్ లేకపోవడాన్ని ఫాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విషమై ఘట్టమనేని అభిమానులు మాత్రం ఒకింత మానసిక క్షోభకు గురి అయ్యారని తెలుస్తోంది.


Share

Related posts

రష్మిక స్పెషల్ ట్వీట్.. మీ కోసమే..

bharani jella

సినిమాని మించిన స్నేహితుడు లేడు

Siva Prasad

తన ఫస్ట్ లవ్ రివీల్ చేసిన “క్రాక్” డైరెక్టర్ గోపీచంద్ మలినేని..!!

sekhar