NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Breaking: తెలుగు చిత్ర సీమలో తీవ్ర విషాదం .. సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇకలేరు

Share

Breaking: తెలుగు చిత్ర సీమలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటులు చంద్రమోహన్ ఈ రోజు తుదిశ్వాస విడిచారు.  హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో హృద్రోగంతో చికిత్స పొందుతున్న చంద్రమోహన్ ఉదయం 9.45 గంటలకు కన్ను మూశారు. ఆయన వయసు 82 ఏళ్ళు. ఆయనకు భార్య జలంధర, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరగనున్నాయి. చంద్రమోహన్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలుపుతున్నారు.

చంద్రమోహన్ గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు  తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించారు. చంద్రమోహన స్వగ్రామం కృష్ణా జిల్లాలోని  పమిడిముక్కల. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన చంద్రమోహన్ ..  కొంత కాలం ఏలూరులో పనిచేశారు. సినిమాలలో నటించాలనే మక్కువతో మద్రాసుకు వెళ్లి ప్రయత్నాలు చేసి సఫలం అయ్యారు. హీరోగా రంగులరాట్నం (1966) చిత్రంతో మొదలుపెట్టిన చంద్రమోహన్ అప్పటి నుండి సహ నాయకుడిగా, నాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించాడు. పలు తమిళ సినిమాల్లోనూ నటించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు. ఆరు నంది అవార్డులు అందుకున్నారు. పదహారేళ్ల వయసు, సిరిసిరి మువ్వ సినిమాల్లో ఆయన నటనకు ఉత్తమ నటుడి గా ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి.

Telangana Election: సంగారెడ్డి సీన్ వేములవాడ బీజేపీలోనూ.. టికెట్ ఖరారు ఒకరికి.. బీఫామ్ మరొకరికి..అధిష్టానంపై తుల ఉమ ఫైర్


Share

Related posts

చిరంజీవి ఆచార్య..ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతుంది .. ఎంతవరకు నిజం..?

GRK

RRR: నైజాం ఏరియాలో ఇప్పటి వరకు ఏ సినిమా అందుకొన్ని రికార్డు “ఆర్ఆర్ఆర్” అందుకుంది..??

sekhar

అబ్బబ్బ ఒకే ఒక్క ఐడియాతో టాప్ లీడర్స్ అందరిచెత శభాష్ అనిపించుకున్న జగన్!

CMR