NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రాజెక్ట్ ప్రకటించి దాదాపు రెండు సంవత్సరాలకు పైగా అయ్యింది. మధ్యలో కరోనా రావడం తర్వాత “RRR” పెద్ద హిట్టు కావడంతో…”NTR 30″ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీయాలని డిసైడ్ అయ్యారు. దీంతో సినిమా కథలో కొరటాల శివ చాలా మార్పులు చేయడం జరిగిందంట. ఎన్టీఆర్.. కెరియర్ లో ఇది 30వ సినిమా నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో సినిమా విజయం సాధించే దిశగా.. కొరటాల చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. తన లాస్ట్ సినిమా “ఆచార్య” అట్టర్ ఫ్లాప్ కావటం అంతకుముందు తీసిన ప్రతి సినిమా పరాజయం పాలు కావడంతో.. మళ్లీ హిట్టు ట్రాక్ ఎక్కటానికి కొరటాల రెడీ కావడం జరిగిందట.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా దివంగత అందాల శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నీ సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇటీవల… తనకి ఇష్టమైన నటుడు ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చింది. అతనితో సినిమా చేయాలని అప్పటినుండి పూజలు చేస్తున్నట్లు.. జాన్వి కపూర్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాదు ప్రతిరోజు తారక్ కి మెసేజ్ లు కూడా పెడుతున్నట్లు… ఆ రకంగా సినిమా సెట్ లో త్వరగా మూవ్ అవడానికి మాట్లాడుతున్నట్లు తెలిపింది.
ఈనెల 23వ తారీకు ఈ సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ కానున్నాయి. ఏప్రిల్ నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏప్రిల్ నెలలో “NTR 30” రిలీజ్ చేయబోతున్నారట. కళ్యాణ్ రామ్ సినిమాకి నిర్మాత. ఈ సినిమా పూజా కార్యక్రమాలకు ఇండస్ట్రీ నుండి చాలామంది ప్రముఖులు… ఎన్టీఆర్ స్నేహితులు సన్నిహితులు రాబోతున్నట్లు సమాచారం. ముఖ్యఅతిథిగా రాజమౌళి హాజరుకానున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.