తెలిసి తెలిసి తప్పు చేస్తున్నాడా?

సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలా సైలెంట్ గా ఉంటాడు, పెద్దగా వివాదాల సైడ్ వెళ్లాడు. ఇది ఇండస్ట్రీ వర్గాలు చెప్పే మాటలు, కానీ రీసెంట్ గా మహేశ్ తెలియకుండానే వివాదాస్పద పనులు చేస్తూ ఎదో ఒక విమర్శ ఫేస్ చేస్తున్నాడు. రీసెంట్ గా తెలంగాణ ఎన్నికలప్పుడు క్యూలో నిలబడకుండా ఓటేసి నెగటివ్ కామెంట్స్ విన్న మహేశ్, లేటెస్ట్ గా మరో విషయంపై విమర్శలు వైన్ పరిస్థితికి వెళ్లేలా ఉన్నాడు.

ప్రస్తుతం మహర్షి సినిమా చేస్తున్న మహేశ్, గతంలో స్పైడర్ సినిమా చేశాడు. మురుగదాస్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా, సూపర్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. స్పైదారి మూవీతో తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో పాగా వేయాలని చూసిన మహేశ్ బాబు ప్లాన్స్ అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. స్పైడర్ సినిమాకి ముందు మన హీరోకి కోలీవుడ్ లో మంచి పేరుండేది కానీ ఈ మూవీ విడుదలైన తర్వాత అక్కడి సినీ అభిమానుల నుంచీ క్రిటిక్స్ నుంచి మహేశ్ యాక్టింగ్ స్కిల్స్ పై కూడా విమర్శలు వినిపించాయి.

ఈ సినిమా చెప్పిన గుణపాఠమో ఏమో తెలియదు కానీ ప్రస్తుతం మహేశ్ ద్రుష్టి అంతా కేవలం తెలుగు సినిమాలపైనే ఉంది. ఇంతక ముందు హిందీ సినిమాలపైనే ఇంట్రెస్ట్ చూపించిన మహేశ్, ఎవరైనా మంచి కథ చెప్తే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తానని చాలా సార్లే చెప్పాడు. అయితే స్పైడర్ రిజల్ట్ ఇంకా మర్చిపోని మహేశ్ బాబు, రీసెంట్ గా బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ… హిందీ సినిమాల గురించి అలోచించి వేస్ట్ చేసుకునే అంత టైం తనకి లేదని తేల్చి చెప్పేశాడు. ఇప్పుడు మహేశ్ చేసిన ఈ కామెంట్స్ అతనికి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టేలా ఉంది. గత కొంత కాలంగా హిందీ, తెలుగు సినీ వర్గాలు కలిసి పనిచేస్తున్నాయి. అక్కడి వారు మన వర్క్ కి ఫిదా అవుతూ పబ్లిక్ గానే కాంప్లిమెంట్స్ ఇస్తూ, మన సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటే మహేశ్ లాంటి స్టార్ హీరో ఇలా మాట్లాడడం ఆశ్చర్యపరిచే అంశం. బాలీవుడ్ లో అవకాశం వస్తే చేస్తాననే లేక మంచి కథ దొరికితే ఆలోచిస్తాననో చెప్పాలి కానీ బాలీవుడ్ లో ట్రై చేసి టైమ్ వేస్ట్ చేసుకోనని చెప్పడం మాత్రం బాగోలేదు.

మన హీరోల్లో కొంత మంది ఇప్పటికే హిందీ సినిమాల్లో నటించారు, కొందరు స్టార్ హీరోలు ఫ్యూచర్ లో పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. మహేశ్ బాబు బాలీవుడ్ పై చేసిన విమర్శలు ఇలాంటి వారి అందరినీ అవమానించినట్లే అవుతుంది. అయినా తెలుగులో స్టార్ స్టేటస్ అందుకున్న మహేశ్ బాబు లాంటి నటుడు, కేవలం ఒక్క సినిమా ఇచ్చిన రిజల్ట్ కే భయపడి లేక అతి జాగ్రత్త పడి ఇతర భాషల్లో సినిమాలు చేయకూడదు అని నిర్ణయించుకోవడం అతని అభిమానులకి కూడా నచ్చి ఉండదు.