సోనూసూద్.. ఇప్పుడు దేశంలో ఈ పేరంటూ తేలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే వెండితెరపై విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఆయన.. నిజజీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నారు. హీరో కాదు చాలా మందికి ఓ దేవుడిలా మారాడు సోనూసూద్. ఇతరులకు సహాయం చేయడంలో ఎంత ఆనందం ఉంటుందో తెలియజేశాడు. ఆపదలో ఉన్నవారికి తమ వంతుగా ఇతరులకు సాయం చేయమని చెబుతున్నాడు సోనూసుద్.
అయితే, వెండితెరపై విలన్‌గానే అందరికి పరిచయం ఉన్న ఈ నటుడు ఇతరులకు ఆపదలో అండగా నిలుస్తూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దీని వెనుకు చాలా విషయమే ఉంది. దేశంలో ఒకపక్క కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో.. ప్రభుత్వం అకస్మాత్తుగా లాల్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలోనే లక్షలాది మంది వలస కార్మికుల తీవ్ర ఇబ్బందుల పడ్డారు. ఆకలితో అలమటించార. ఆపన్న హస్తం కోసం ఎదురుచూశారు. తమకు సహాయం చేయాలని ఎంతో మందిని వేడుకున్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వలస జీవులకు నేనున్నానంటూ అండగా నిలిచారు సోనూసూద్. సెలబ్రిటీగా ఉండి ఏ ఒక్కురూ చేయని రీతితో వారికి సహాయం చేసి శభాష్ అనిపించుకున్నారు. వందలాది మందికి ఉచితంగా ఆహారం అందించారు. దీంతో పాటు వలస జీవులను వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. ఇలా వలస జీవుల పట్ల ఇంత పెద్ద మనసు చేసుకుని వారికి సహాయం చేయడం వెనుక అసలు కథేంటీ అని చాలా మందిలో ఇప్పటికీ ప్రశ్నలొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన పై రాజకీయ బురదజల్లే ప్రయత్నం కూడా జరిగింది. అయితే, వలస జీవులకు అండగా నిలవటం వెనుక ఉన్న అసలు కథ గురించి సోనూసూద్ తాజాగా చెప్పారు.
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో వందల కీలోమీటర్లు నడుస్తూ వెళ్తున్న వలస జీవులకు ఎలాగైన సహాయం చేయాలనుకున్నాననీ, అయితే, వారికి తాను ఏం చేయగలనో మొదట్లో తెలియలేదని సోనూ చెప్పారు. ఈ క్రమంలోనే వారికి ఆహార పదర్థాలు అందించడం ప్రారంభించానని తెలిపారు. ఇలా గడుస్తుండగా.. 30 మందికి పైగా ఉన్న వలస జీవుల సమూహం తన వద్దకు వచ్చిందనీ, వారందరూ కర్నాటకకు నడుచుకుంటూ వెళ్లాల్సి వుందని.. 10 రోజులకు సరిపడా ఆహారం ఇవ్వమని కోరారని చెప్పారు. అయితే, వారికి పది రోజుల ఆహారం ఇచ్చి చేతులు దులుపుకోకుండా వారిని గమ్య స్థానాలకు చేర్చితే మరింత ఆనందంగా ఉంటారనిపించింది. అందుకే వారి కోసం రవాణా సౌకర్యం ఏర్పాటు చేశాననీ.. ఆ తర్వాత ఇదే తరహాలో తన సహాయం కొనసాగింది అని తెలిపారు. సినిమా షూటింగ్‌లు తిరిగి మొదలు కావడంతో ఈ రియల్ హీరో మళ్లీ వెండితెరపై విలన్ పాత్రల్లో మెరవడానికి సిద్ధమవుతున్నాననీ, మీ ఆదరణ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని సోనూసూద్ తెలిపారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!