Murali Krishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మురళీకృష్ణ ఆ తర్వాత అనేక పాత్రలు చేయడం తెలిసిందే. నటనలో మాత్రమే కాక డైరెక్టర్ గా అదేవిధంగా నిర్మాతగా కూడా కొన్ని సినిమాలు మురళీకృష్ణ అందించారు. సినిమా రంగంలో అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హీరో కృష్ణతో ఉన్న అనుబంధాన్ని గురించి మురళీకృష్ణ నెమరు వేసుకోవడం జరిగింది. ఒకానొక సమయంలో కృష్ణ ఫ్యాన్స్ సినిమాలో ఒక సీన్ విషయంలో కొట్టడానికి వచ్చారు అని అన్నారు. మురళి కృష్ణ గారి మాటల్లో..” కృష్ణ నేను ఇంటర్ క్లాస్ మేట్స్. అప్పట్లో మా కాలేజ్ మొత్తానికి కృష్ణ గారే అందగాడు. అందరూ ఆయన చుట్టే తిరిగే వారు. కాలేజ్ తర్వాత “తేనెమనసులు” సినిమాతో ఆయన హీరోగా మారడం మాత్రమేగాక అనతికాలంలోనే సూపర్ స్టార్ గా ఇండస్ట్రీలో ఎదిగాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ తర్వాత నేను నటన వైపు నుండి నిర్మాతగా మారాక కృష్ణ నాగార్జున కాంబినేషన్ లో వారసుడు అనే సినిమాని నిర్మించడం జరిగింది. ఆ సినిమాలో నాగార్జున తండ్రిగా కృష్ణ నటించారు. సినిమాలో ఒక సన్నివేశంలో తండ్రి కృష్ణ అని కొడుకు నాగార్జున నిలదీసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సన్నివేశంలో కృష్ణా నాగార్జున నువ్వానేనా అన్నట్టుగా నటిస్తారు. దీంతో సినిమాలో ఆ సన్నివేశం చూసి కృష్ణ అభిమానులు.. ఏకంగా మా ఇంటి మీదకి గొడవకు దిగారు. కొంతమంది అభిమానులు ఏకంగా కొట్టడానికి కూడా వచ్చారు. కృష్ణ గారి ని పట్టుకుని నాగార్జున అలా ఎలా మాట్లాడుతాడు..? ఆ సన్నివేశాలు వెంటనే సినిమా నుండి కట్ చేయండి. లేకపోతే ఊరుకునే ప్రసక్తి లేదు.. అన్నయ్య అభిమానులు గొడవకు దిగారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ సమయంలో నేనే కలుగజేసుకుని అభిమానులతో నేరుగా మాట్లాడి… సినిమాని సినిమాలా గా చూడండి. స్టోరీ.. క్యారెక్టర్ బట్టి చూడండి. వ్యక్తిగతంగా తీసుకోవద్దు. అని చెప్పినా గాని వాళ్ళు వినలేదు. ఎంత నచ్చచెప్పినా వెనక్కి తగ్గలేదు. కృష్ణ గారి పై అంత అభిమానం. నటుడిగా మాత్రమే కాదు.. చాలా విషయాలలో కృష్ణ చాలా గొప్ప వ్యక్తి. తన సినిమా నిర్మాత ఎవరైనా నష్టపోతే వెంటనే తన ఇంటికి పిలిపించుకుని మరో సినిమా చేస్తానని నిర్మాతకి మంచి భరోసా ఇచ్చే వారు. అటువంటి గొప్ప మనిషి నేను ఎంత వరకు ఇండస్ట్రీలో ఎవరిని చూడలేదు. అంటూ మురళి కృష్ణ కృష్ణ గారి గొప్పతనం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!