Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత ఏడాది “అలా వైకుంఠపురం లో” సినిమా తో ఇండస్ట్రీలో నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ పడిన గాని దాదాపు ఏడాది నుండి తన దర్శకత్వంలో మరో సినిమా ఏదీ కూడా ఇప్పటివరకు త్రివిక్రమ్ స్టార్ట్ చేయలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అధికారికంగా ప్రకటించిన ఇప్పుడప్పుడే మొదలయ్యే ఛాన్స్ కనపడటం లేదు. అంతకుముందు ఎన్టీఆర్ తో సినిమా అధికారికంగా ప్రకటించిన కానీ అది మధ్యలోనే ఆగిపోవడం తెలిసిందే.
ఇటువంటి తరుణంలో తమిళ ఇండస్ట్రీలో టాప్ హీరో ఒక వెలుగు వెలుగుతున్న సూర్య తెలుగులో కూడా మార్కెట్ ఉండటంతో అతని తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ వార్త వినబడుతుంది. సూర్యకి తెలుగులో పాటు తమిళంలో మంచి మార్కెట్ ఉండటంతో పాన్ ఇండియా తరహాలో ఈ సినిమా చేయాలని.. త్రివిక్రమ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Read More: Surya: టాలీవుడ్ టాప్ డైరెక్టర్.. నిర్మాతతో సూర్య మూవీ..??
ఇదిలా ఉంటే సూర్య ఆల్రెడీ ఇప్పటికే తెలుగు లో మాస్ పల్స్ బాగా తెలిసిన డైరెక్టర్ గా పేరొందిన బోయపాటి తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ట్లు వార్తలు ఇటీవల రావటం జరిగింది. అయితే ఇంతలోనే మరో టాప్ డైరెక్టర్ గా పేరొందిన త్రివిక్రమ్‌తో సూర్య సినిమా చేయడం కోసం.. రెడీ అవుతున్నట్లు వార్తలు రావడంతో ఇండస్ట్రీలో సూర్య తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారాయి. చాలా తెలివిగా సూర్య దక్షిణాది సినిమా రంగంలో మార్కెట్ పెంచుకునే రీతిలో సినిమాలు చేస్తున్నాడు అని సినిమా మేకర్స్ విశ్లేషిస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!