గత కొద్దీ రోజులుగా మీడియాలో కె.ఎ.పాల్ బయోపిక్ మీద న్యూస్ వినపడింది. ప్రముఖ కమెడియన్ సునీల్ పాల్ పాత్రలో నటిస్తున్నారని వార్తల సమాచారం. నిజానికి ఈ సినిమా రూపొందుతుందా? అనే అనుమానాలు కూడా వచ్చాయి. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. సునీల్ మేకోవర్ కోసం హాలీవుడ్ మేకప్మ్యాన్ని సంప్రదించారట. అలాగే ఈ సినిమాని అమెరికాలో కూడా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో కొన్ని సీన్స్ ఉంటాయట. అందుకోసం అమెరికా అధ్యకుడు ట్రంప్ లాగే పోలికలు వుండే ఆర్టిస్ట్‌తో సన్నివేశాలను చిత్రీకరిస్తారట. అలాగే నార్త్ కొరియా అధ్యకుడు కిమ్ జామ్, హాలీవుడ్ స్టార్ నటి ఏంజెలీనా జోలీలాగా ఉండే ఆర్టిస్ట్‌లు కూడా నటిస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ నెల 16 తర్వాత సునీల్ ఇండియాకి వస్తారట. ఆతర్వాత ఈ సినిమా గురించి అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఉంటుందని సమాచారం.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!