ఇతర భాషల్లోని సినిమాలను తెలుగులోకి.. తెలుగు సినిమాలను వేరే భాషల్లోకి రీమేక్ చేస్తుంటారు. రీమేక్ చేసేటప్పుడు ఆయా నెటివిటీలకు తగిన విధంగా సినిమాలను మలుస్తారు. అయితే కొన్ని సినిమాలను నెటివిటీకి అనుగుణంగా మార్చడం అంటే చాలా కష్టమైన విషయం. ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందా? అని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు `గల్లీబాయ్స్` సినిమా పరిస్థితి అలాగే ఉంది. ఈ ఏడాది బాలీవుడ్లో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో గీతాఆర్ట్స్ రీమేక్ చేయాలనుకుంది. ముంబైలోని పాప్ కల్చర్‌పై ఈ సినిమా ఉంటుంది. మరి ఈ సినిమాను తెలుగులోకి మన నెటివిటీకి తగ్గట్టు ఎలా మారుస్తారో అర్థం కావడం లేదు. ఎందుకంటే తెలుగులో పాప్ కల్చర్ లేదు ఈ సినిమాలో ముందుగా సాయిధరమ్ తేజ్‌ను నటింప చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు విజయ్ దేవరకొండ పేరు వినపడుతుంది. అయితే చేతి నిండా సినిమాలతో బిజి బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమా రీమేక్‌లో నటించడానికి ఒప్పుకుంటాడో .. లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే..
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!