Court Cases : పని మీద వెళ్లే ముందు
కోర్టు కేసులలో విజయం పొందాలి అన్న ,ఉన్నతాధికారుల దగ్గర పనులు జరగాలి అన్న ఓం నమో భాస్కరాయ జగదాత్మనే రాజానాం వశ మానయ వశ మానయ కార్యం కురు కురు స్వాహ ఈ రాజ వశీకరణ మంత్రాన్ని పని మీద వెళ్లే ముందు ఇంట్లో 108 సార్లు జపం చేసుకుని దారిలో వెల్తుకూడా మననం చేసుకుంటూ వెళితే మీరు వెళ్ళిన పనులలో విజయం రావడం తో పాటు మీరు అనుకున్న పని సక్రమం గా జరుగుతుంది.
Court Cases : అప్పు ఇచ్చిన వారి దగ్గరకు
మీ దగ్గర అప్పు తీసుకున్నవారు మీకు తిరిగి సరిగ్గా డబ్బు చెల్లించకపోతే, వారి నుండి ఈ మొత్తం డబ్బులు తిరిగి రాబట్టుకోవడానికి ఈ తంత్ర పరిష్కారాన్ని చేసుకుని చూడండి. ఇది తెలికైనది కాబట్టి ఎవరైనా ఇంటిలోనే అందుబాటులో ఉన్న వస్తువులను వాడుకుని చేసుకోవచ్చు.
ఈ పరిహారం కోసం మీరు శుభ్రమైన ఒక తెల్ల కాగితం తీసుకొని, ఆపై సిందూర్ సిరా అంటే సింధూరం నీటిలో కలిపి ఉంచుకుని ఆ కాగితంపై మీరు అప్పు ఇచ్చిన వారి పేరు రాయాలి. ఆ పేరు రాయడానికి మీరు ఏదైనా చెట్టు నుండి చిన్న సన్నని కొమ్మను పెన్నుగా వాడుకోవచ్చు. మీరు అప్పు ఇచ్చిన వారి పేరు వ్రాసిన తరువాత, మీరు వ్రాసిన పేరు మీద ఐదు లవంగాలు , 5 వెల్లుల్లి రెబ్బలను పెట్టాలి.
లవంగాలు , వెల్లుల్లి రెబ్బలను లోపల ఉంచేసి కాగితాన్ని మడిచేయాలి. ఒకసారి కాగితాన్ని మడచిన తర్వాత, మీరు మళ్ళి కాగితాన్ని తెరవకూడదు. ఎప్పుడు ఈ ప్యాకెట్‌ను మడతపెట్టే ఉంచాలి. అప్పు వసూలు చేయడానికి మీరు అప్పు ఇచ్చిన వారి దగ్గరకు వెళ్ళేటపుడు, మీరు ఈ మడి చిన కాగితాన్ని మీషర్ట్ జేబులో పెట్టుకోవాలి. ఇది రికవరీ అయ్యే ప్రక్రియను వేగం చేసి, మీ బాకీని త్వరగా ,పూర్తిగా వసూలు చేయడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది.డబ్బు పూర్తిగా వసూలైన తర్వాత, ఈ మడిచి ఉంచిన కాగితాన్ని ఏదైనా నది, కాలువ సరస్సులో వేసేయాలి. మీకు ఎన్ని అప్పులు వసూలు కావాలో దానికి అనుగుణంగా మీకు కావలసినన్ని కాగితపు పొట్లాలను మీ బాకీలు వసూలు చేసుకోవడం కోసం మీరు తయారు చేసుకోవాలి.