NewsOrbit
Featured దైవం న్యూస్

Today Horoscope జనవరి -20- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.

Daily horoscope in telugu

జనవరి – 20 – పుష్యమాసం – బుధవారం.

Today Horoscope జనవరి -20- బుధవారం ఈరోజు రాశి ఫలాలు.
Today Horoscope జనవరి 20 బుధవారం ఈరోజు రాశి ఫలాలు

 మేష రాశి : ఈరోజు వ్యాపారంలో నష్టాలు !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటం మంచిది. అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఉంది. వాదోపవాదాలకు దూరంగా ఉండడం మంచిది. అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది. వాహన ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది, ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. నిగ్రహశక్తితో మనోవేదనకు గురి కాకుండా ఉండడం మంచిది. ఆలోచించి పనులు చేయడంవల్ల బాగుంటుంది. మీ మీద నరఘోష పడే అవకాశం ఉంది. నిద్ర ఆహారాలను తీసుకోవడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పట్టుదలతో అనుకున్న పనులను పూర్తి చేయడం చేయడం మంచిది. అప్పులు ఇవ్వకుండా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు అనవసర విషయాలకు దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది. స్త్రీలకు పని వత్తిడి పెరిగే అవకాశం ఉంది.

రెమిడీ: ఈరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదమే.

వృషభ రాశి : ఈరోజు అందరితో కలిసిమెలిసి ఉంటారు !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి చూసే అవకాశాలను ఈరోజు పొందుతారు. ఇంతకు ముందున్న గొడవలన్నీ తగ్గిపోయి అందరితో కలిసిమెలిసి ఉంటారు. సంగీతం, సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. సాంప్రదాయ పద్ధతులకు, ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యతనిస్తారు. మిత్రులతో కలిసి ఆలోచించి పనులు పూర్తి చేసుకుంటారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు, పెట్టుబడులు పెట్టి లాభాలు లాభాలు పొందుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గతంలో రావాల్సిన డబ్బులు సమయానికి చేతికి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశం పొందుతారు. క్రొత్త కార్యక్రమలను  ప్రారంభించాలని అనుకుంటారు. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టి బాగా చదువుకుంటారు. స్త్రీలు కుటుంబ సభ్యులతో సఖ్యత గా ఉంటారు.

రెమిడీ:  శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మిధున రాశి : ఈరోజు ప్రశాంతత కోల్పోతారు !

ఈరోజు కొంచెం కష్టంగా ఉంటుంది. ఎవరితో గొడవ పడకుండా వివాదాలకు పోకుండా ఉండటం మంచిది లేదంటే కుటుంబ సభ్యులు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఈరోజంతా చేపట్టిన పనులను ఓర్పుగా సహనంగా పూర్తి చేసుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. తినే ఆహారాన్ని వృధా చేయకుండా సమయానికి నిద్రాహారాలు తీసుకోవడం మంచిది. మిత్రులకు దూరంగా ఉండటం మంచిది, మిత్ర ద్రోహం జరిగే అవకాశం ఉంది. ఏ పనిలో ఆయన ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పెద్ద వారి సూచనలను, మాటలను పాటించడం మంచిది. సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. విద్యార్థులు స్నేహితులకు దూరంగా ఉంది అనవసర విషయాలను ఆలోచించకుండా చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరిగి ప్రశాంతత కోల్పోతారు. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. క్రొత్త పెట్టుబడులు పెట్టకుండా ఉండడం మంచిది.

రెమిడీ:  ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి, దగ్గర్లో ఉన్న గణపతి ఆలయానికి వెళ్లి గరికను  సమర్పించుకోండి.

కర్కాటక రాశి : ఈరోజు వేడుకల్లో పాల్గొంటారు !

ఈరోజు ప్రయోజకరంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. సాంప్రదాయక ఆహార వ్యవహారాల మీద ఆసక్తి చూపుతారు. విలువైన ఆభరణాలను, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. సంగీత సాహిత్య సాంస్కృతిక విషయాల మీద మక్కువ చూపుతారు. కొత్త విద్యలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. అనుకున్న పనులను సరైన సమయంలో పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో బాగుంటారు, ఇంతకు ముందున్న అనారోగ్యాలు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేయడానికి ఆసక్తి చూపుతారు. వ్యాపార పెట్టుబడి పెట్టి వృద్ధి చెంది లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులు పై అధికారులతో మెప్పు పొందుతారు. విద్యార్థులు తండ్రి కష్టాన్ని చూసి బాగా చదువుకోవాలని తపన పడతారు.

రెమిడీ: ఈరోజు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

సింహరాశి : ఈరోజు ఆదాయం తక్కువగా ఉంటుంది !

ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. ఆయన వారితో, బంధువులతో అభిప్రాయభేదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అప్పుల బాధలు పెరిగే అవకాశం ఉంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు చేయకుండా ఉండడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీ కంటే చిన్న వారితో గొడవ పడే అవకాశం ఉంది. గొడవలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులు పై అధికారుల అనుమతి లేకుండా పనులు చేయడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. స్త్రీలు భర్త అనుమతి లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇబ్బందులు. విద్యార్థులు చదువు మీద సరైన శ్రద్ధ పెట్టి చదువుకోవడం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు దుర్గా దేవి అష్టోత్తర పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

కన్యారాశి : ఈరోజు వ్యాపారాన్ని విస్తస్తారు !

ఈరోజు అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపారాన్ని విస్తస్తారు, లాభాలు పొందుతారు. అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. ఇంతకుముందు రావాల్సిన డబ్బులను సమయానికి చేతికి అందుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. ఆర్థికాభివృద్ధి పెరుగుతుంది. ధనాభివృద్ధి కలుగుతుంది. వస్తువుల కొనుగోలు చేస్తారు. పిల్లల గురించి జాగ్రత్తలు తీసుకుంటారు. సోదరుల నుంచి శుభవార్తలు వింటారు. శత్రువులకు గుణపాఠం చెప్పి వారిని మిత్రులుగా చేసుకుంటారు. పట్టుదలతో సమయస్ఫూర్తిగా పనులను చేస్తారు. ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. స్నేహితులతో కలసి కొత్త విషయాలను తెలుసుకుంటారు. కొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సహాయంగా ఉంటారు. ప్రతి పనిలో, ప్రతి విషయంలో ఇతరుల సహాయాన్ని సహకారాన్ని కోరుకుంటారు.

రెమిడీ:  విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి.

తులారాశి : ఈరోజు మానసిక ప్రశాంతతను కోల్పోతారు !

ఈరోజు అనుకూలంగా లేదు. కొత్త పరిచయాలు చేసుకోవడం మంచిది కాదు. ఏదైనా తప్పు చేసి దాన్ని కప్పిపుచ్చుకునే పని చేయకుండా ఉండటం మంచిది. అనవసరపు ఆలోచనలు చేసి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఆహార నియమాలు పాటించడం మంచిది. డబ్బులను తక్కువగా ఖర్చు పెట్టడం మంచిది. సంపద తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలకు దూరంగా ఉండడం మంచిది. వాహన ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా చేయడం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. బంధువులతో విభేదాలు కలిగే అవకాశం ఉంటుంది. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది, ఎక్కడైనా పోయే అవకాశం ఉంటుంది. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువ కనిపిస్తుంది. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీకున్న చిరాకు వల్ల, కోపం వల్ల వచ్చిన అవకాశాలను దూరం చేసుకునే అవకాశం ఉంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయకుండా ఉండటం మంచిది. అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులు చదువు మీదనే ఏకాగ్రత చూపడం మంచిది. వ్యాపారంలో స్వల్ప నష్టాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది, కనిపించకుండా ఉంటుంది.

రెమిడీ:  ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి అంతా శుభప్రదమే.

వృశ్చిక రాశి : ఈరోజు శుభవార్తలు వింటారు !

ఈరోజు బాగుంటుంది. వివాహ ప్రయత్న చర్చలు ఫలిస్తాయి. నూతన వ్యాపారాలకు అనుకూలంగా ఉంటుంది. లాభాలు పొందుతారు. మీలో ఉన్న ఆధ్యాత్మిక తత్వం, పూజలు, భక్తి నుంచి ఫలితాలనిస్తాయి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఏదో ఒకటి సాధించాలని తపన పడతారు. మంచిగా జీవించాలని అనుకుంటారు. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధించడానికి బాగా చదువుకుంటారు. ధైర్యంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెద్దవారిని గౌరవిస్తారు, వారి మాటలను సూచనలను పాటిస్తారు. పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు మీ ప్రతిభను చూపించి ఇంక్రిమెంట్లు పొందుతారు.

రెమిడీ: ఈరోజు లలితా చాలీసా పారాయణం చేసుకోండి అంతా శుభప్రదం.

ధనస్సు రాశి : అప్పుల బాధలు పెరుగుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరుగుతాయి. చేసే పనుల మీద ఆసక్తి లేక బద్ధకం పెరుగుతుంది. అనుకున్న పనులను వాయిదా వేసే అవకాశం ఉంటుంది. సమయానికి నిద్ర ఆహారాలను తీసుకోలేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మనసులో ఉన్న కోరికలను బయటకి చెప్పలేక మనోవేదనకు గురయ్యే అవకాశం ఉంటుంది. అతిగా మాట్లాడటం వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల కోసం ఆందోళన పడతారు. ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. విద్యార్థులు అనవసర వాటికి దూరంగా ఉండి చదువు మీద శ్రద్ధ పెట్టడం మంచిది.

రెమిడీ: లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి శుభ ఫలితాలు కలుగుతాయి.

మకర రాశి : ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు అనుకూలంగా ఉంటుంది. చిన్నప్పటి స్నేహితులను కలుసుకునే అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు ఆఫీస్లో ఉన్న సమస్యల నుంచి బయట పడి అధికారులతో మంచి పేరు తెచ్చుకుంటారు. ఇంతకు ముందున్న అనారోగ్యము తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. మీ వాక్చాతుర్యం వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. అందరితో కలిసి మెలిసి సంతోషంగా ఉంటారు. అప్పుల బాధ నుంచి బయట పడతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. గతంలో విభేదాలు వచ్చినా భార్యాభర్తలు తిరిగి కలుసుకుంటారు. ఆచార సాంప్రదాయాలకు, పద్ధతులకు ప్రాధాన్యతనిస్తారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడానికి ప్రాధాన్యతనిస్తారు. దేవాలయ దర్శనం చేసుకుంటారు. సాంకేతిక విద్యలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. విద్యార్థులు చదువు మీద దృష్టి పెట్టి చదువుకొని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లాభాలు కలుగుతాయి.

రెమిడీ: లలితా అష్టోత్తర శత నామ స్తోత్ర పారాయణం చేసుకోండి.

కుంభరాశి : ఆరోగ్య విషయంలో జాగ్రత్త !

ఈరోజు అనుకూలంగా లేదు. క్రమశిక్షణ లోపించడం వల్ల అనుకున్న పనులు వాయిదా పడే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఎవరైతే ఇష్టపడతారో వారిని దూరం చేసుకొనే అవకాశం ఉంటుంది. మీ కోపాన్ని తొందరపాటు తనాన్ని దూరంగా ఉంచుకోవడం మంచిది, లేదంటే ఆయన వారు దూరం అయ్యే అవకాశం ఉంటుంది. అనవసరపు ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. ఏమీ చెయ్యలేము అని అసహనంగా లోనయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పని వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది లేదంటే నష్టం జరిగే అవకాశం ఉంటుంది.

రెమిడీ: ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోండి అంతా శుభప్రదమే.

మీన రాశి : ఈరోజు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి !

ఈరోజు బాగుంటుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ప్రకటనలు చూసి కొత్త వ్యాపారాలను ప్రారంభించి లాభాలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. మిత్రుల ద్వారా ధన లాభం పొందుతారు. మొండి బకాయిలు వసూలు చేసుకుంటారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తులు వచ్చే అవకాశం ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. మీ మాట తీరు వల్ల సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి మెలిసి ఉంటారు. మీ పనికి తగ్గ గౌరవ మర్యాదలు పొందుతారు. విద్యార్థులు బాగా కష్టపడి చదువుకొని పరీక్షల్లో ఉత్తమ మార్కులు పొందుతారు. గతంలో ఇబ్బంది పడ్డ వ్యాపారస్తులకు ఈరోజు లాభాలు పొందుతారు, వ్యాపార అభివృద్ధి పెరుగుతుంది.

రెమిడీ:  శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

 

author avatar
Sree matha

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju