న్యూస్ సినిమా

ఆలియా భట్ కి పెద్ద సమస్యే వచ్చింది.. అందుకే ఆసుపత్రిలో జాయిన్ అయిందట..?

Share

ఆలియా భట్ ప్రస్తుతం వరసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. పాన్ ఇండియన్ సినిమాలు కావడం తో బల్క్ డేట్స్ కేటాయిస్తోంది. అంతేకాదు లాక్ డౌన్ కారణంగా ఇన్ని నెలలు షూటింగ్స్ అన్ని నిలిపోయి మళ్ళీ అన్ని సినిమాలు సెట్స్ మీదకి వచ్చి శరవేగంగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్న సినిమాలు కూడా సెట్స్ మీదకి వచ్చాయి. దాంతో ముందు కమిటయిన ప్రకారం షెడ్యూల్స్ లో జాయిన్ అవుతోంది ఆలియా భట్. నాన్ స్టాప్ గా ఆలియా భట్ నటిస్తున్న సినిమాలు చిత్రీకరణ సాగుతున్నాయి.

ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి ఆలియా భట్ ముంబై టు హైదరాబాద్ కంటిన్యూ గా ట్రావెల్ చేస్తోంది. ఒకవైపు షూటింగ్స్ ఒకవైపు ట్రావెలింగ్ తో ఆలియా కి అసలు తీరిక దొరకడం లేదట. ప్రస్తుతం ఆలియా భట్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో నటిస్తోంది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ – మెగా పవర్ స్టార్ రాం చరణ్ లు హీరోలుగా పాన్ ఇండియన్ రేంజ్ లో 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఆర్ఆర్ఆర్ తాజా షెడ్యూల్ జరుగుతోంది.

ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ క్లైమాక్స్ సీన్స్ లో ఎన్.టి.ఆర్ – రాం చరణ్ పాల్గొంటున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడిస్తూ తాజాగా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా ఆలియా భట్ కంటిన్యూ షూటింగ్స్ వల్ల విపరీతంగా అలసిపోయి నిద్రలేమి సమస్య వచ్చిందట. దాంతో తప్పని పరిస్థితుల్లో ఆసుపత్రిలో జాయిన్ కావాల్సి వచ్చిందట. నిద్ర సరిగా లేకపోతే డల్ అయిపోయి షూటింగ్స్ కి ఇబ్బంది కలుగుతుందని ట్రీట్ మెంట్ కూడా తీసుకుందట.

కాగా మళ్ళీ ఆసుపత్రి నుంచి కోలుకున్న వెంటనే ‘గంగూభాయ్’ షూటింగ్ లో జాయిన్ అయిందట. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసి వచ్చే నెల నుంచి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణలో జాయిన్ కానుందట ఆలియా భట్. ఇక లాక్ డౌన్ తర్వాత ఆర్ఆర్ఆర్, గంగూభాయ్, బ్రహ్మాస్త్ర సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ మూడు సినిమాలు వరస బెట్టి షూటింగ్స్ చేస్తోంది ఆలియా. కాగా ఆర్ఆర్ఆర్.. బ్రహ్మాస్త్ర సినిమాలు ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.


Share

Related posts

Fish: చేప లంటే బాగా ఇష్టమా?అయితే ఎలాంటి చేపలు తినాలో తెలుసుకోండి!!

Kumar

Keerthy Suresh Recent Photos

Gallery Desk

Ram charan : రామ్ చరణ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ వల్లే స్పీడ్ తగ్గిందా..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar